Begin typing your search above and press return to search.
ప్రవాస భారతీయులకు పొగపెడుతున్న బ్రిటన్
By: Tupaki Desk | 21 Feb 2018 5:40 AM GMTమరోదేశంలో మనోళ్లకు పొమ్మనలేక పొగపెట్టడం మొదలైంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికా మాదిరిగా వలసదారులపై ఆంక్షలు మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన చట్ట సవరణలను ప్రవాస భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్రిటన్ లో ప్రవాస భారతీయులు నిరసన చేపట్టారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసినట్టయితే తాము తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. బ్రిటన్ ప్రధాని తన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
పార్లమెంట్ వెలువల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర దేశాలకు చెందినవారిని కూడా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ అత్యున్నత నైపుణ్యమున్న వలస జాతీయుల (హైలీ స్కిల్డ్ మైగ్రాంట్స్-హెచ్ ఎస్ ఎం) బృందంలో సుమారు వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వారిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల ఉండే దేశాలకు చెందిన డాక్టర్లు - ఇంజనీర్లు - ఐటీ నిపుణులు - టీచర్లు ఉన్నారు. నిరసన కార్యక్రమంలో దక్షిణ ఆసియా - ఆఫ్రికా దేశాలకు చెందిన నిపుణులను కూడా హెచ్ ఎస్ ఎం కలుపుకుపోతోంది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ - బంగ్లాదేశ్ - నైజీరియా దేశాలకు చెందిన వారు పాల్గొంటారని ప్రవాస భారతీయుల యూనియన్ సభ్యులు తెలిపారు.
బ్రిటన్ లో శాశ్వత నివాసం (ఇన్ డెఫినైట్ లీవ్ టు రిమైన్-ఐఎల్ ఆర్) కోసం పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో జాప్యాలతో పాటు వాటిని తిరస్కరించడానికి వ్యతిరేకంగా వృత్తి నిపుణులు - వారి కుటుంబాలు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. గతనెల డౌనింగ్ స్ట్రీట్ ( ప్రధాని అధికారిక నివాసం) వెలుపల నిరసన చేపట్టిన ఈ గ్రూపు నిర్వాహకుల్లో ఒకరైన అదితి భరద్వాజ్ మాట్లాడుతూ - సహేతుకమైన కారణాలు చూపకుండా యూకేలో ఉంటూ పనిచేసుకునే హక్కును ప్రభుత్వం తిరస్కరిస్తున్నందు వల్ల తమ ర్యాలీకి మరింత మంది మద్దతు తెలుపుతున్నారని ఆమె చెప్పారు. కొన్నేండ్ల కిందట టైర్-1 (జనరల్) వీసా కింద యూకేలో అడుగుపెట్టిన వృత్తి నిపుణులు ఆ దేశంలో ఐదేండ్ల పాటు చట్టబద్ధంగా నివసిస్తే శాశ్వత నివాస హోదా పొందడానికి వారు అర్హులు.