Begin typing your search above and press return to search.

హైవేలు స‌రే గ్రామీణ దారుల గ‌తేంటో?

By:  Tupaki Desk   |   15 Feb 2022 9:30 AM GMT
హైవేలు స‌రే గ్రామీణ దారుల గ‌తేంటో?
X
రాష్ట్రంలో ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధికి కేంద్రం ఎంత‌గానో స‌హ‌క‌రిస్తోంది. ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రం నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కూ ప‌నులు వేగం వేగంగానే చేసింది. అదేవిధంగా ర‌ణ‌స్థ‌లం నుంచి విశాఖ వ‌ర‌కూ ఉన్న జాతీయ ర‌హ‌దారి ప‌నులు కూడా పూర్త‌య్యాయి.

6 లైన్ల ప‌నులు వేగం వేగంగానే చేసి ప్ర‌జ‌ల నుంచి అభినంద‌న‌లు అందుకుంది.దీంతో విద్యుత్ కాంతుల న‌డుమ ఈ ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం ఇప్పుడు మ‌రింత సునాయాసం అయింది.ముఖ్యంగా శ్రీ‌కాకుళం నుంచి విశాఖ వ‌ర‌కూ ప‌నుల‌న్నీ పూర్త‌వ్వ‌డ‌మే కాదు ఎక్క‌డా ఏ ఇబ్బందీ లేకుండా బైపాస్ రోడ్ల నిర్మాణం కూడా పూర్త‌యిపోయింది.

ఇదే స‌మ‌యంలో కొన్నిచోట్ల బైపాస్ రోడ్ల నిర్మాణంపై అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి. కానీ ఇక్క‌డ మాత్రం ప‌నుల‌కు ఎక్కడా అడ్డు లేకుండా జ‌రిగిపోయాయి.ఇక రానున్న కాలంలో మ‌రిన్ని ర‌హ‌దారుల అభివృద్ధికి కేంద్రం ప‌దివేల కోట్ల‌కు పైగా నిధులు వెచ్చించేందుకు సుముఖంగా ఉంది.

ఏడు వంద‌ల కిలోమీట‌ర్ల‌కు పైగా జాతీయ ర‌హ‌దారిని అభివృద్ధి చేసేందుకు మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సుముఖ‌త వ్య‌క్తం చేశారు.ఈ మేర‌కు ఇందుకు సంబంధించిన ప‌నుల‌కు ఈ నెల 17 శంకు స్థాప‌న జ‌ర‌గ‌నుంది.

ఇక జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం సంబంధిత ప‌నుల్లో రాష్ట్రం భాగ‌స్వామ్యం ఏమీ ఉండ‌దు కానీ గ్రామీణ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ మాత్రం అధ్వానంగా ఉంది. వీటిపై సంక్రాంతి త‌రువాత దృష్టి సారిస్తామ‌ని చెప్పిన వైసీపీ ప్ర‌భుత్వం ఆ సంగ‌తి ఎందుక‌నో విస్మ‌రిస్తోంది.రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సంబంధించి టెండ‌ర్ల‌కు పిలిచినా కూడా పెద్ద‌గా ఆస‌క్తి ఎవ్వ‌రూ చూప‌లేద‌ని కూడా తెలుస్తోంది.

ఈ ద‌శ‌లో అధ్వానంగా ఉన్న రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ అన్న‌ది ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌నే స్ప‌ష్టం అవుతోంది. రోడ్ల దుఃస్థితిపై ఇప్ప‌టికే జ‌న‌సేన గ‌గ్గోలు పెట్టింది. సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ధ‌మే చేసింది. అప్పట్లో ఓ రెండు వంద‌ల కోట్ల‌తో రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సిద్ధంగానే ఉన్నామ‌ని అన్నారు. పాఠ‌శాల‌ల మాదిరిగానే నాడు నేడు అంటూ ర‌హ‌దారుల‌కూ మ‌హ‌ర్ద‌శ ఇస్తామ‌ని సీఎం చెప్పారు.కానీ ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ ఫేజ్ ప‌నులు ఇంత‌వ‌ర‌కూ ఆరంభం కాక‌క‌పోవ‌డం శోచ‌నీయం.