Begin typing your search above and press return to search.
మళ్లీ హిజాబ్ రక్తపాతం.. 31మంది ప్రాణాలు తీసింది.. ఒక అమ్మాయి వల్లే ఇదంతా!
By: Tupaki Desk | 23 Sep 2022 8:53 AM GMTకర్ణాటకలో పుట్టిన 'హిజాబ్'లొల్లి ఖండాలు దాటి విద్వేశాన్ని ఎగజిమ్ముతోంది. ఇతర దేశాలకు పాకి అక్కడ అగ్గి రాజేస్తోంది. ఇరాన్ లో హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నైతికత పేరుతో పోలీసులు అరెస్ట్ చేసిన 'మహ్సా అమినీ' మరణించడం ఆ దేశాన్ిన అట్టుడికి పోయేలా చేసింది. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో నిరసనలు మిన్నంటాయి. ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేస్తుండడంతో ప్రాణాలు పోతున్నాయి. ఇరాన్ లో భద్రతా దళాల అణిచివేతలో 31మంది మరణించడం విషాదం నింపింది.
-ఇరాన్ లో 'హిజాబ్' లొల్లి ఎలా మొదలైంది? ఇరాన్ లో 'షరియా' చట్టాలను అనుసరించి రూపొందించిన చట్టాల ప్రకారం.. మహిళలు తప్పనిసరిగా 'హిజాబ్' ధరించాలి. తల , జుట్టు కనిపించకూడదు. శరీరం కనపడకుండా పొడవైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి అయితే 'మహ్సా అమీని' ధరించిన హిజాబ్ కింద నుంచి జుట్టు కొంచెం కనిపిస్తోందని ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఆమెను సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. నిర్బంధంలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయింది. మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారు. పోలీసు అధికారులు ఆమెను తలపై లాఠీతో కొట్టారని.. ఆమె తలను వాహనానికేసి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరాన్ లో ప్రజలు, యువత భగ్గుమన్నారు.
-మొరాలిటీ పోలీస్ వ్యవస్థ చేసే పని ఇదీ ఇరాన్లో మహిళలను రక్షించేందుకు మొరాలిటీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహిళలు సరైన దుస్తులు ధరించకపోతే.. మగవాళ్లు రెచ్చిపోయి వారికి హాని కలిగిస్తారని.. అందుకే వీళ్లు రక్షణ కల్పిస్తారు.
ఈ పోలీసులు ఆరు బృందాలుగా పనిచేస్తారు. ఒక్కో బృందంలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఉంటారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెడుతారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘించేవారిని పట్టుకొని అరెస్ట్ చేస్తారు.
-మహ్సా ఆమినీ మరణంతో భగ్గుమన్న ప్రజలు దేశంలో హిజాబ్ నిబంధనలు పాటించలేదని మహ్సా ఆమినీ పోలీసుల చేతిలో మరణించడంతో వారం రోజులుగా ఇరాన్ భగ్గుమంటోంది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఉధృతమైన నిరసనలను అరికట్టడానికి, ఇరాన్ గురువారం టెహ్రాన్, కుర్ధిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేసింది. ఇన్ స్టాగ్రామ్ , వాట్సాప్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు యాక్సెస్ ను బ్లాక్ చేసింది.
ఇరాన్ పశ్చిమ కుర్దిస్తాన్ ప్రావిన్స్ లోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయానికి దాదాపు అంతరాయం ఏర్పడింది. సనందాజ్, టెహ్రాన్ తో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రాంతీయ బ్లాక్ అవుట్ లు ఉన్నాయి. వీధి ర్యాలీలు 15 నగరాలకు వ్యాపించాయి. 1000 మంది నిరసనకారుల గుంపులను చెదరగొట్టడానికి పోలీసుల బాష్పవాయువు ప్రయోగించి అరెస్ట్ లు చేయవలసి వచ్చింది.
ప్రదర్శనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలు, డబ్బాలను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఇరాన్ మీడియా వెల్లడించింది. దేశంలో అరెస్ట్ లు పెరిగాయి. కానీ నిరసనగా మహిళలు హిజాబ్ లేకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం కూడా పెరిగింది. ఆమీనీ మరణం తర్వాత ఇది ఇంకా పెరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.