Begin typing your search above and press return to search.
ఏపీకి పాకిన హిజాబ్ రచ్చ.. బుర్కా వేసుకొస్తే బయటకే..
By: Tupaki Desk | 17 Feb 2022 7:30 AM GMTహిజాబ్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే కర్ణాటక వణికిపోతోంది. రాష్ట్రంలో హిజాబ్ ధరించి విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు హాజరుకావద్దనే వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇప్పుడీ హిజాబ్ అంశం ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకింది.
ఇదే తరహాలో విజయవాడలో కూడా ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ఓ కాలేజీ యాజమాన్యం బుర్కా వేసుకోవచ్చారని కొంత మంది ముస్లిం విద్యార్థులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఫస్ట్ ఇయర్ నుంచి తాము బుర్కాలోనే కళాశాలకు హాజరవుతున్నామని.. కాలేజీ ఐడీ కార్డ్ లో సైతం తాము బుర్కాతోనే ఫొటో దిగామంటూ విద్యార్థినులు వాపోతున్నారు. దీంతో కాలేజీ వద్దకు ముస్లిం పెద్దలు చేరుకున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
-హిజాబ్ అంటే ఏమిటీ?
హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.
1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.
గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.