Begin typing your search above and press return to search.
కర్టాటకలో ‘హిజాబ్’ హీట్..: రాజకీయ పార్టీల మధ్య రగడ..
By: Tupaki Desk | 6 Feb 2022 5:33 AM GMTవిద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు ‘హిజాబ్’ ధరించడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వీరు హిజాబ్ ధరించొద్దంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే హిజాద్ ధరించడం తమ హక్కు అని ముస్లిం విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిందూమతానికి చెందిన విద్యార్థి, విద్యార్థినులు కాషాయ కండువతో విద్యాసంస్థలకు వస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటి వివాదం చోటు చేసుకోవడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా.. కొన్ని పార్టీల నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.
1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.
గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.
ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై ఈనెల 8న విచారణ చేపట్టనున్నారు. ఇంతలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె విద్యాశాఖ, న్యాయశాఖతో సంప్రదింపులు జరిపి శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వలు జారీ చేశారు. అయితే అటు రాజకీయ పార్టీల మధ్య రగడ మొదలైంది. హిజాబ్ ధరిస్తే ‘తాలిబనైజేషన్’ ను ప్రోత్సహించినట్లవుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్ ఎస్ఎస్ పై మండిపడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రభుత్వం కావాలనే చేస్తోందన్నారు. అయితే హెచ్ డీ కుమారస్వామి మాత్రం ఇప్పటి వరకు అనుమతించిన ప్రదేశాల్లో హిజాబ్ కు అనుమతివ్వండి.. కొత్తగా ప్రవేశపెట్టిన చోటల నిషేధించండి.. అని అన్నారు.