Begin typing your search above and press return to search.

బంగ్లా విమానం హైజాక్‌..భారత్‌ పై దాడికేనా.?

By:  Tupaki Desk   |   25 Feb 2019 4:51 AM GMT
బంగ్లా విమానం హైజాక్‌..భారత్‌ పై దాడికేనా.?
X
20 ఏళ్ల క్రితం కాందహార్‌ లో జరిగిన విమానం హైజాక్‌ వ్యవహారం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో ప్రయాణికుల్ని బెదిరించి.. ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని ఉపయోగించే అమెరికాలో దాడులకు తెగబడింది అల్‌ ఖైదా. అప్పటినుంచి విమానాల విషయంలో ప్రపంచ దేశాలన్నీ చాలా కఠిన నియమ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి. కానీ నిన్నటికి నిన్న ఇలాంటి కాందహార్‌ లాంటి సంఘటనే మరొకటి బంగ్లాదేశ్‌ లో జరగబోయింది.

ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న విమానాన్ని ఓ దుండగుడు హైజాక్‌ చేశాడు. విమానం కాక్‌ పిట్‌ లోకి వెళ్లి ఒక పైలెట్‌ ని కాల్చాడు. ఇంకో పైలెట్‌ ని బెదిరించాడు. అయితే అప్రమత్తమైన పైలెట్‌.. విమానాన్ని చిట్టగ్యాంగ్‌ లో ఎమర్జెన్సీ లాండింగ్ చేశాడు. అప్పటికే సమాచారం తెలుసుకున్న బంగ్లా ఆర్మీ.. చిట్టగ్యాంగ్‌ విమానాశ్రయాన్ని తమ అధీనంలో తీసుకుంది. ల్యాండింగ్‌ అయిన విమానాన్ని చుట్టుముట్టి ఆ దుండగుడ్నిఅరెస్ట్‌ చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే.. విమానంలోకి ఆ దుండగుడికి తుపాకీ ఎలా వచ్చింది - అతగాడు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. బంగ్లా విమానాన్ని హైజాక్‌ చేసింది భారత్‌ పై దాడికోసమేనేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఎందుకంటే.. విమానం హైజాక్‌ కు సరిగ్గా 6 గంటల ముందు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్‌ గా ఉండాలని.. పౌరవిమానయాన శాఖకు ఆదేశాలు అందాయి. విమానం హైజాక్‌ చేసి మనపై దాడి చేయబోతున్నారని విషయం ఇంటెలిజెన్స్‌కు ముందు సమాచారం లీకైంది. అయితే..అది బంగ్లా నుంచి మనవైపు వస్తుందనేది మాత్రం ఊహించలేకోయింది. బంగ్లా ఆర్మీ క్విక్‌ గా రెస్పాన్స్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.