Begin typing your search above and press return to search.
స్టాలిన్ vs అప్సరా ... స్టాలిన్ ఓడించి తీరుతానని హిజ్రా అప్సరారెడ్డి శపథం !
By: Tupaki Desk | 3 March 2021 10:42 AM GMTతమిళనాడు లో ఎన్నికల కోలాహాలం మాములుగా లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని ప్రధాన పార్టీలు కూడా విజయం కోసం పక్కా ప్రణాళికలు రచించి, వారి వ్యూహాలని పక్కాగా అమలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అధికారం కోసం అధికార పక్షమైన అన్నాడీఎంకే గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకొని బీజేపీ కూడా బరిలోకి దిగి తమ సత్తా చాటాలని ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టింది. అలాగే డీఎంకే కూడా ఈసారి అధికారం తమదే అంటూ ప్రచారం లో దూసుకుపోతుంది. ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగిస్తుందని పలు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం కావడం ఖాయమని చెబుతున్నారు.
ఇకపోతే , కొళత్తూరు నియోజక వర్గం నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను ఓడిస్తానని అన్నాడీఎంకే ప్రచార కార్యకర్త, హిజ్రా అప్సరారెడ్డి శపథం చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా కొళత్తూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా అప్సరారెడ్డి మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధిష్ఠానం ఆదేశిస్తే కొళత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసి స్టాలిన్ ను ఓడిస్తానని తెలిపారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగాలని ప్రజలంతా ఆశపడుతున్నారని, స్టాలిన్ అదేపనిగా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి ఎడప్పాడిపైనా పసలేని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం తన లాంటి హిజ్రాలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. స్టాలిన్ ను ఓడించే శక్తి సామర్థ్యాలు తనకు మాత్రమే ఉన్నాయని ఆమె చెప్పారు.
తమిళనాడులో ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 12 న విడుదల కాబోతుంది. ఇక నామినేషన్లకు చివరి తేది మార్చి 19 కాగా , నామినేషన్ల పరిశీలన మార్చి 20 నుండి ప్రారంభిస్తారు. ఆ తరవాత ,నామినేషన్ల ఉపసంహరణ మార్చి 22 వరకు సమయం ఇచ్చారు. ఇక తమిళనాడు లో పోలింగ్ ఏప్రిల్ 6 న జరగనుంది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం మే 2 న విడుదల కాబోతుంది.