Begin typing your search above and press return to search.
అమ్మ మీద పోటీ సై అన్న హిజ్రా
By: Tupaki Desk | 6 April 2016 6:41 AM GMTఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. తన పదవికి రాజీనామా చేసి.. జైలుకెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తర్వాత బయటకు రావటం ఇప్పుడు అప్పీల్ కేసు నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మధ్యన ఆమె మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యేందుకు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. సదరు ఉప ఎన్నిక సందర్భంగా ఆమెపై పోటీకి నిలిచేందుకు నామినేషన్లు వేసేందుకు సైతం భయపడిన పరిస్థితి.
అయితే.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఆ మధ్యన జరిగిన ఉప ఎన్నికకు అమ్మ మీద పోటీ అంటే అమ్మో.. అంటూ భయపడిన దానికి భిన్నంగా తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెపై పోటీకి ఒక హిజ్రా సై అనటం ఆసక్తికరంగా మారింది.
చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న జయలలితకు ప్రత్యర్థిగా నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) పార్టీ తరఫున సామాజిక కార్యకర్త... హిజ్రా అయిన దేవి బరిలోకి దిగేందుకు రెఢీ అయ్యారు. తమిళ సినీ దర్శకుడైన సీమన్ కు చెందిన పార్టీ తరఫున దేవి పోటీ చేస్తున్నారు. జయలలితపై పోటీకి రెఢీ అయిన సందర్భంగా మాట్లాడుతూ.. జయలలిత తీరుపై నిప్పులు చెరిగారు. జయలలితను గెలిపించిన ఆర్కే నగర్ కు ఆమె చేసిందేమీ లేదన్న దేవి.. తనను కానీ ప్రజలు గెలిపిస్తే విద్య.. వైద్యానికి ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు. మరి.. ఆర్కే నగర్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..?