Begin typing your search above and press return to search.
ట్రంప్ సెల్ఫ్ డబ్బాకు దిమ్మతిరిగే కౌంటర్ ఈ కార్టూన్
By: Tupaki Desk | 24 July 2019 12:11 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనదేశంలో కొత్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌పై తనను మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ కోరారని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు డిమాండ్ చేశాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల తోనే పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చినా విపక్షాలు శాంతించలేదు. ఇలా రాజకీయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభం అనే పేరున్న పత్రికా వ్యవస్థ నుంచి ఈ దుమారంపై ఆసక్తికర స్పందన వచ్చింది.
`కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని మోదీ నన్ను కోరారు ` అంటూ భారతదేశానికి చెందిన సున్నితమైన అంశాన్ని ట్రంప్ టచ్ చేసినట్లుగానే అమెరికాకు చెందిన సున్నితమైన అంశమైన మెక్సికో బార్డర్‌పై మనదేశానికి చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా అదే రీతిలో కౌంటర్ ఇచ్చింది. అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణం గత ఎన్నికల సమయంలో ప్రధాన హామీగా ట్రంప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. అదే సమయంలో విపక్షాలు ట్రంప్‌ను టార్గెట్ చేస్తున్నాయి. దీన్ని పురస్కరించుకొని టైమ్స్ కార్టూన్ వేసింది.
ట్రంప్ పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌తో సమావేశం అయినట్లుగానే మెక్సికో అధ్యక్షుడితో సమావేశం అయిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆయనతో ``మెక్సికో-అమెరికా మధ్య సరిహద్దు గోడ నిర్మాణం విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నన్ను బతిమాలుకున్నారు`` అంటూ వ్యాఖ్యానిస్తున్న కార్టూన్ వేసింది! ట్రంప్ కామెంట్లకు టైమ్స్ కార్టూన్ టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా సరిగ్గా సరిపోయిందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు.