Begin typing your search above and press return to search.
ఫలితాల తర్వాత మొదటిసారి వెలుగులోకి హిల్లరీ!
By: Tupaki Desk | 12 Nov 2016 4:00 AM GMTరెండున్నర శతాబ్ధాల అతిపెద్ద ప్రజాస్వామిక చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడిన మొదటి మహిళగా ఆమెను మీడియా - ప్రజలూ కొనియాడారు. ప్రచారంలో కావాల్సినంత మద్దతిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి... మరుసటిరోజు అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు హిల్లరీ. అంతవరకూ బాగానే ఉంది... అనంతరం హిల్లరీ మీడియాలో లేరు.. ఏ ఒక్కరికీ కనిపించలేదు! మీడియా కూడా గెలిచిన ట్రంప్ గొప్పోడాకాదా - సమర్ధుడా కాదా - అమెరికాను ఎలా నడిపిస్తాడు - అమెరికాలోని వివిద రాష్ట్రాల్లో జరుగుతున్న ట్రంప్ వ్యతిరేక నినాదాలు మొదలైన విషయాల గురించి వార్తలు ప్రసారం చేశాయే తప్ప... హిల్లరీ ఇప్పుడేమిచేస్తున్నారనే విషయాన్ని మరిచాయి!! బహుశా ఆమె విషణ్నవదనంలో ఉండి ఉంటారని కొందరు భావించారు. కానీ... ఆమె అలా లేరు!!
ఓటమి అనంతరం మీడియాలో మచ్చుకైనా కనిపించని హిల్లరీ వార్తలు... శుక్రవారం నాడు మాత్రం అమెరికా సహా ప్రపంచంలోని ప్రధాన వార్త సంస్థలన్నీ హిల్లరీకి సంబంధించిన ఫొటోలను ప్రచురించాయి. ఫలితాల తర్వాత మొదటిసారి వెలుగులోకి వచ్చిన ఫోటోలంటూ హిల్లరీ ప్రస్తుతం ఏమిచేస్తున్నారనే విషయాలకు సంబందించి ఫోటోలను ప్రచురించాయి. అయితే ఈ ఫొటోలో కూతుర్ని ఎత్తుకుని ఉన్న మహిళ తో కుక్కపిల్లను పట్టుకున్న హిల్లరీ నవ్వుతూ కనిపించారు. దీంతో ఏమిటీ ఈ కథ అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ ఫోటోలో హిల్లరీ పక్కన నిల్చున్న ఆమెపేరు మార్కోట్ గెర్ స్టర్. న్యూయార్క్ శివారులోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో నివాసముండే ఈమె హిల్లరీకి డై హార్డ్ ఫ్యాన్! ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ లో ఈ ఫొటో పోస్ట్ చేసిన ఈమె ఇలా రాసింది... "నా అభిమాన నాయకురాలి (హిల్లరీ) ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది.. ఇంట్లో కూర్చుని ఎంతో బాధపడ్డాను.. ఎన్నాళ్లిలా బాదపడుతూ ఉంటామని నా చిన్నారిని తీసుకుని పార్క్ కు వెళ్లాను.. సరిగ్గా ఆసమయంలో నా ఎదురుగా హిల్లరీ! ఆమెను చూసి ఒక్కసారి షాక్ కు గురయ్యా.. వెంటనే తేరుకుని ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకున్నాను.. ఆ సమయంలో బిల్ క్లింటన్ కూడా పక్కనే ఉన్నారు. కుక్కపిల్లను పట్టుకుని ఇద్దరూ బయటకు వచ్చినట్టున్నారు.. ఆ సమయంలో హిల్లరీ మేడం నన్ను ఓదార్చారు.. లైఫ్ మస్ట్ గో ఆన్.. తరహా మాటలతో ఊరటనిచ్చారు" అని ముగించింది.
హిల్లరీ ఓటమి ఆమె అభిమానులకు ఇప్పుడొక విషాద సంఘటన. ఈ విషయంపై ఆమె అభిమానులు ఎవరు స్పందించినా... కేవలం ఎన్నికల్లో ఓడిపోయారనే బాద కాకుండా అంతముమించిన బాదేదో వ్యక్తపరుస్తున్నారు. కొంతమందైతే హిల్లరీ ఓటమిని ఇప్పటికీ నమ్మలేకుండగా, మరికొంతమంది ఆమె అపజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ... లైఫ్ ముందుకు పోతూ ఉండాలిగా! ఎన్నికల ఫలితాలపై ఒబామా చెప్పినట్లు... సూర్యుడు ఉదయించక మానడు! ట్రంప్ పరిపాలనను అమెరికా ప్రజలు రుచి చూడకా మానరు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/