Begin typing your search above and press return to search.

హిల్లరీ - ట్రంప్ రెండో డిబేట్‌ మినిట్స్!

By:  Tupaki Desk   |   10 Oct 2016 5:36 AM GMT
హిల్లరీ - ట్రంప్ రెండో డిబేట్‌ మినిట్స్!
X
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్ - డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండో డిబేట్‌ లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష బరిలో భాగంగా వీరి మధ్య సెయింట్ లూయిస్‌ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో రెండో డిబేట్ ప్రారంభమైంది. ఈ డిబేట్‌కు మోడరేటర్‌ గా సీఎన్ ఎన్ ప్రతినిధి ఆండ్రూసన్ కూపర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ ఎండగడుతుండగా, ట్రంప్ కొత్త ఆరోపణలతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన మాటల యుద్దం ఇలా ఉంది.

హిల్లరీ: ట్రంప్ వ్యక్తిత్వమేంటో ఆడియోటేపుల్లో బయటపడింది - అధ్యక్ష పదవికి ట్రంప్ తగినవ్యక్తి కాదు అనడానికి ఆ ఒక్క విషయం చాలు.

ట్రంప్: మహిళలను నేనెప్పుడూ కించపరచలేదు - వారిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఆడియో టేపుల్లో బయటపడిన వ్యవహారాన్ని ప్రైవేటు సంభాషణగా మాత్రమే చూడాలి. అయినా సరే నేను చేసిన వ్యాఖ్యల పట్ల అమెరికా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. అసలు మహిళలను కించపరిచింది హిల్లరీ భర్త బిల్ క్లింటనే. అధికార వ్యవహారాలకు వ్యక్తిగత మెయిల్‌ ను వాడిన విషయంలో హిల్లరీ క్షమాపణలు చెప్పాలి, 33 వేల ఈమెయిల్స్‌ ను ఆమె ఎందుకు తొలగించారో చెప్పాలి. అసలు ఈ ఈమేయిల్స్ వ్యవహారంలో హిల్లరీ జైల్లో ఉండాలి - తాను గెలిస్తే మాత్రం ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరిపిస్తాను. 12 ఏళ్ల బాలికపై బిల్ క్లింటన్ అత్యాచారానికి పాల్పడ్డారు, అయినా హిల్లరీ నోరు మెదపలేదు. బిల్ క్లింటన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

హిల్లరీ: ఈమెయిల్స్ వ్యవహారంలో ఎప్పుడో నా తప్పును నేను అంగీకరించాను. ఇక ముస్లింలను అవమానించడం సరికాదు, అమెరికా అందరికి స్వాగతం పలుకుతుంది, పలకాలి. ఇస్లాంతో అమెరికన్లు యుద్ధం చేయడం లేదు. అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుండటంతోపాటు... ట్రంప్‌ను పుతిన్ ఎందుకు సమర్ధిస్తున్నారో? అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు, ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు.

ట్రంప్: హిల్లరీకి ప్రతిదానికి రష్యాను నిందించడం అలవాటైపోయింది. రష్యాతో గానీ, పుతిన్‌ తో గానీ నాకెలాంటి సంబంధాలు లేవు. నేను అధికారంలోకి వస్తే పన్నులను కనిష్ట స్థాయికి తీసుకోస్తాను.

మొత్తంగా చూస్తే.. ఈ డిబేట్ లో హిల్లరీకి 57 శాతం మంది మద్దతు పలకగా.. డొనాల్డ్ ట్రంప్ కు 34 శాతం మంది మాత్రమే అండగా నిలవటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పలు వివాదాల్లో కూరుకుపోతూ.. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ట్రంప్ కు.. మొదటి డిబేట్ తో పోలిస్తే.. రెండో డిబేట్ లోనే ఆయనకు మద్దతుగా నిలిచే వారి సంఖ్య పెరిగింది. మొదటి డేబేట్ లో ఆయనకు 27 శాతం మంది మాత్రమే మద్దతు పలకగా.. రెండో డిబేట్ తో ఆ సంఖ్య మరింత మెరుగైనప్పటికీ.. హిల్లరీ అధిక్యం ముందు ట్రంప్ వెనుకబడిన పరిస్థితి. మొత్తంగా చూస్తే.. మొదటి డిబేట్ మాదిరే.. రెండో డిబేట్ లోనూ ట్రంప్ ను హిల్లరీ దెబ్బేశారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/