Begin typing your search above and press return to search.

నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగుతోందట

By:  Tupaki Desk   |   3 Nov 2016 6:00 AM GMT
నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగుతోందట
X
రోజులు గడుస్తున్న కొద్దీ అమెరికా అధ్యక్ష ఎన్నికల రూపురేఖలు మారిపోతున్నాయి. అభ్యర్థి ఎంపిక మొదలు నుంచి నిన్న మొన్నటి వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా నిలిచిన వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి వెనుకబడి ఉన్నారు. ఆయనెంత ప్రయత్నించినా.. ట్రంప్ ను నమ్మేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరన్న భావన సర్వత్రా వినిపించింది. ఇదిలా ఉండగా హిల్లరీ ఈ మొయిల్స్ ఇష్యూకు సంబంధించి ఎఫ్ బీఐ విచారణను తిరగదోడిన నేపథ్యంలో పరిస్థితులు హిల్లరీకి ప్రతికూలంగా మారిపోయాయి.

నిన్న మొన్నటి వరకూ ట్రంప్ పై స్పష్టమైన అధిక్యతతో ఉన్న హిల్లరీ.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిపిన సర్వేల్లో హిల్లరీని ట్రంప్ దాటేసినట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికలు వారం రోజులకు వచ్చేశాయి. ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కు సంబంధించి ఇరు వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

పోలింగ్ దగ్గర పడుతున్న వేళ.. రెండు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్న వేళ.. మరో వారం వ్యవధిలో ఈ రెండు పార్టీలు వందలాది కోట్ల రూపాయిల్ని ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి. ఇరు వర్గాలకు చెందిన వారు పోలింగ్ నాటికి మరో రూ.285 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఇదిలా ఉండగా.. ఇరువురు అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. వీలైనన్ని ఎక్కువ సభల్ని ఏర్పాటు చేసి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో మహా టైట్ గా ఉన్న రాష్ట్రాల మీద ఇద్దరు అభ్యర్థులు దృష్టి పెట్టారు. అవసరమైతే.. ఈ రాష్ట్రాల్లో ఖర్చు చేయటానికి ఏ పార్టీకి ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇద్దరు అభ్యర్థులకు ఒహయో.. ఫ్లోరిడా రాష్ట్రాలు కీలకంగా మారాయి. చివరి వారంలో ఈ రెండు రాష్ట్రాలపై ఇద్దరు అభ్యర్థులతో పాటు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ప్రచారం చేయనున్నారు. మన మాదిరి.. ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరువుగా వచ్చిన నేపథ్యంలో రోజులో వీలైనన్ని సభలకు హాజరై.. ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఏదైనా.. ఎన్నికల ప్రచార సరళి దాదాపు ఒక్కటే అన్నట్లు లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/