Begin typing your search above and press return to search.
పెద్దన్న పోస్ట్ కోసం ఆమె వస్తున్నారు
By: Tupaki Desk | 13 April 2015 6:10 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి.. హిల్లరీ క్లింటన్ మీద చాలామందికి చాలానే అంచనాలు ఉన్నాయి. సమర్థవంతమైన నాయకురాలిగా.. బహుముఖ ప్రతిభాశాలి అయిన హిల్లరీ క్లింటన్ ఏదో ఒక రోజు అమెరికా దేశ అధ్యక్షురాలు అయ్యే ఛాన్స్ ఉందన్న మాట వినిపిస్తుంటుంది.
ఆ దిశగా సుదీర్ఘకాలంగా పావులు కదుపుతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన తొలి అడుగు పడినట్లు అయ్యింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా హిల్లరీ బరిలోకి దిగుతారని స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారు.
2016 నవంబరులో జరిగే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె విజయానికి తామంతా కలిసికట్టుగా పని చేస్తామని డెమోక్రాటిక్ నేతలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన బిల్ క్లింటన్ సతీమణి అయిన.. హిల్లరీ.. అన్నీ బాగుంటే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అద్భుత అవకాశం హిల్లరీకి దక్కవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.