Begin typing your search above and press return to search.
లెంపలేసుకునేది ఇప్పుడా హిల్లరీ?
By: Tupaki Desk | 10 Sep 2015 4:12 AM GMTఅత్యున్నత స్థానాలకు గురి పెట్టేవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలని ఎంతోకాలంగా ఉబలాటపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ ఎట్టకేలకు లెంపలేసుకుంటున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ల తరఫున బరిలోకి దిగాలని ఆమె భావిస్తున్నారు. ఇందుకోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రైవేట్ ఈ మొయిల్ వివాదం తెరపైకి వచ్చింది. తాను చేసిన తప్పును ఒప్పుకొని.. గట్టిగా లెంపలేసుకొని.. తనను క్షమించాలని కోరుకుంటున్నారు.
ఇంతకీ అంత పెద్ద హిల్లరీ చేసిన తప్పేంటన్నది చూస్తే.. అమ్మడు విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో తన నివాసంలో ప్రైవేట్ మొయిల్ సర్వర్ ను వినియోగించటంపై గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆమె మాత్రం తాను అలాంటి పనులేమీ చేయలేదని గట్టిగా వాదించారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ నేత బాబీ జిందాల్ ఆ మధ్య.. తన రాజకీయ ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ పై ఇదే ఆరోపణ చేయటం తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం గురించి ప్రస్తావించిన బాబీ జిందాల్.. తాను కానీ ఒక్క ఫిర్యాదు చేస్తే.. జైలు తప్పదని వ్యాఖ్యానించారు.
హిల్లరీ చేసిన తప్పులకు సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్న బాబీ జిందాల్ మాటలకు తగ్గట్లే.. తాజాగా హిల్లరీ క్లింటన్ తన తప్పును ఒప్పుకొని లెంపలేసుకున్నారు. గతంలో ప్రభుత్వ అనుమతితోనే తాను ప్రైవేట్ ఈమొయిల్ సర్వీసు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పిన హిల్లరీ.. తాజాగా మాత్రం తప్పు చేశానని.. బాధ్యత మొత్తం తనదేనని చెప్పారు. మరి.. అమెరికన్లు ఆమె సారీకి ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికన్ల సంగతి తర్వాత.. చట్టం ఏమంటుందో చూడాలి?