Begin typing your search above and press return to search.
హిల్లరీ.. భారీగా ఫీలైన సందర్భమిది
By: Tupaki Desk | 24 Aug 2017 5:57 AM GMTఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి.. ఆయనతో అధ్యక్ష పదవికి పోటీ పడ్డ డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మధ్యనున్న రాజకీయ పంచాయితీ అందరికి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వారిద్దరి మధ్య నడిచిన మాటల యుద్ధం ఎంతన్నది ప్రపంచానికి సుపరిచితమే. అయితే.. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ కారణంగా తనకు వచ్చిన ఒక ఇబ్బందికర పరిస్థితిని తాజాగా ఒక పుస్తకంలో వెల్లడించారు హిల్లరీ క్లింటన్.
ట్రంప్ మాట ఎత్తితేనే తీవ్రంగా చిరాకు ప్రదర్శించే హిల్లరీ.. ఆయన కారణంగా ఒక సందర్భంలో తీవ్ర ఇబ్బందికి గురైనట్లు పేర్కొన్నారు. ట్రంప్ తన పక్కన ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించిందన్న ఆమె.. తన తాజా పుస్తకమైన వాట్ హ్యాపెన్డ్ లో.. ఇంతవరకు బయటకు రాని ఉదంతాన్ని పేర్కొన్నారు.
వచ్చే నెల 12లో మార్కెట్లోకి రానున్న ఈ పుస్తకంలో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. రెండో బిగ్ డిబేట్ లో చోటు చేసుకున్న ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. రెండో బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్ మహిళల గురించి అసభ్యంగా అన్న మాటలు తాను విన్నానని.. ఆ తర్వాత రెండు రోజులకు ఓ చిన్న వేదిక మీద ఎదురుపడాల్సి వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా తాను తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు చెప్పారు. "అతను ఎదురుగా కనిపించాడు. నాకు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. నా దగ్గరగా తిరుగుతూ ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాను. ఒక దశలో ఊపిరి కూడా ఆడలేదు. ఆ క్షణంలో అతన్ని నాకు దూరంగా ఉండాలని బిగ్గరగా హెచ్చరించాలని అనిపించింది" అని పేర్కొన్నారు. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు పట్టేలా ఉన్న ఈ ఉదంతం పుస్తకం మీద మరింత ఆసక్తిని పెంచేలా చేయటంతో పాటు.. ఆ పుస్తకం విడుదల కోసం ఎదురుచూసేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. అధ్యక్ష ఎన్నికల్లోఓటమి ఎలా ఎదురైంది? అందుకు కారణాల్ని వాట్ హ్యాపెన్డ్ పుస్తకంలో ప్రస్తావిస్తారో లేదో చూడాలి.