Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడి వ‌ల్లే ఐసిస్‌ లో చేరిక‌లు

By:  Tupaki Desk   |   22 Dec 2015 7:20 AM GMT
అమెరికా అధ్యక్షుడి వ‌ల్లే ఐసిస్‌ లో చేరిక‌లు
X
ఐఎస్ ఐస్‌..ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఉగ్ర‌వాద సంస్థ పేరు తెలియ‌ని దేశం ఏదీ ఉండ‌దేమో. అంత రాక్ష‌సంగా ఐసిస్ ఉగ్ర‌వాదులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు మ‌రి. ఆయా దేశాల్లో త‌మ ఉనికిని చాటుకోవ‌డంలో శ‌త‌విధాల కృషిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ రాక్ష‌స మూక అంటేనే విరుచుకుప‌డే అమెరికానే ఇపుడు చేరిక‌ల‌ను ప్రోత్సాహిస్తోంద‌ట‌. అమెరికా ప్రోత్సాహంతో చేరిక‌లు జ‌ర‌గుతున్నాయ‌ని చెప్పింది ఏ ముస్లిం దేశ‌మో లేక‌పోతే ముల్లాలో కానేకాదు. ఏకంగా అమెరికా విదేశాంగ శాఖ‌మంత్రి హిల్ల‌రి క్లింట‌న్‌.

అమెరికాలో నివసిస్తున్న ముస్లింలపై నిఘా పెట్టాలని, అగ్రరాజ్యంలోకి కొత్తగా ముస్లింల ప్రవేశాన్ని నిలిపేయాలని రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై హిల్ల‌రీ స్పందిస్తూ@ ట్రంప్ చెప్పిన‌ మాటలు ఐఎస్ వ్యాప్తిని తగ్గించకపోగా మరింత పెంచాయి! ట్రంప్ మాట్లాడిన వీడియోలను చూపించి ఉగ్రవాదులు ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది భయంకరమైన పరిణామం' అంటూ విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున, హిల్లరీ డెమోక్రాటిక్ పార్టీ తరఫున తలపడుతున్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడిన హిల్లరీ 'ట్రంప్ ఐఎస్ ఐఎస్ రిక్రూటర్‌ గా తయారయ్యాడు' అని విమర్శించారు. ముస్లింల పట్ల ట్రంప్ ఉద్దేశం మత దురభిమానానికి నిదర్శనమని, ఆయన భావనలతో అమెరికాకు ఎలాంటి సంబంధమూ లేదని హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వంటి వాళ్ల వ్యాఖ్యల వల్ల ఉగ్రవాదంపై పోరు ముస్లింల అణచివేతగా ప్రచారమయ్యే ప్రమాదం ఉదని హిల్లరీ అన్నారు. ప్రస్తుత తరుణంలో అమెరికన్ ముస్లింలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు.