Begin typing your search above and press return to search.
భారత్ ను తిట్టినందుకు హిల్లరీ వాయించేసింది
By: Tupaki Desk | 13 May 2016 1:11 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్షుడు కావడానికి ఇదే సులభమైన మార్గం అనుకున్నాడో ఏంటో కానీ.. అవసరమున్నా లేకున్నా భారతీయుల్ని తిట్టిపోయడం.. వాళ్లను కించపరచడం అతడికి అలవాటైపోయింది. ట్రంప్ కు చాలామంది అమెరికన్లు మద్దతిస్తున్న నేపథ్యంలో అతడి వ్యాఖ్యల్ని ఖండించడానికి చాలామంది సాహసించట్లేదు. ఐతే ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఎట్టకేలకు ఈ విషయంలో పెదవి విప్పింది. భారతీయుల్ని తిడుతున్న ట్రంప్ మీద విరుచుకుపడింది. అతణ్ని నోర్మూసుకోమని హెచ్చరించింది.
భారత్ లాంటి దేశాలపై విమర్శలు చేయడం సరికాదని.. అది ఆయన అహంకారానికి నిదర్శనం అని హిల్లరీ వ్యాఖ్యానించారు. కొన్ని మతాలు.. జాతులను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు దేశానికే ప్రమాదమని.. ఆయన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల అమెరికన్ల పట్ల ద్వేష భావానికి బీజాలు నాటుతున్నాయన్నారు. విదేశాల పైన అనసవర మాటలు మానుకుని.. నోర్మూసుకోవాలని ఆమె ట్రంప్ ను హెచ్చరించారు.
ఈ మధ్య ఓ ప్రచార సభలో మాట్లాడుతూ ట్రంప్ భారతీయ కాల్ సెంటర్ ఉద్యోగుల్ని కించపరిచాడు. ఓ అమ్మాయిని ఉద్దేశించి.. ఏంటి నువ్వు ఇండియన్ కాల్ సెంటర్ ఉద్యోగిలాగా మాట్లాడుతున్నావ్ అని ఎద్దేవా చేశాడు ట్రంప్. అమెరికన్లు ఉద్యోగాలు దోచుకుంటున్నారని.. వాళ్లను తరిమేస్తానని ఇండియన్లపై పలుమార్లు విషం కక్కాడు ట్రంప్.