Begin typing your search above and press return to search.
ట్రంప్ మాటతో హిల్లరీ హెల్త్ రిపోర్ట్ బయటకు..
By: Tupaki Desk | 18 Aug 2016 5:21 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోగ్యంపై లేవనెత్తిన సందేహాలతో కలకలం సృష్టించారు. దీనికి కౌంటర్ అన్నట్లు తాజాగా డెమొక్రటిక్ పార్టీ తమ అభ్యర్థి హిల్లరీ ఆరోగ్యంపై ఒక నివేదికను విడుదల చేసింది.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. హిల్లరీ క్లింటన్ పై విమర్శలు గుప్పించారు. అందులో భాగంగా హిల్లరీ ఆరోగ్యవంతురాలు కాదన్న ఆరోపణలు చేశారు. ‘‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ మీద చర్యలు తీసుకునేందుకు హిల్లరీ శారీరకంగానూ.. మానసికంగానూ బలహీనురాలు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని హిల్లరీ ప్రచార బృందం తీవ్రంగా ఖండించింది. తాజాగా హిల్లరీ క్లింటన్ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశారు. డోనాల్డ్ ట్రంప్ చిలకపలుకుల్లాంటి అబద్ధాల్ని వల్లె వేస్తున్నారని మండిపడింది.
ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో హిల్లరీ క్లింటన్ కు చెందిన పూర్తి ఆరోగ్య నివేదికల్ని విడుదల చేశారు. ఈ నివేదికల్లో ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలని సదరు పత్రాలు పేర్కొంటున్నాయి. వీటితోపాటు హిల్లరీ క్లింటన్ దాఖలు చేసిన పన్ను పత్రాల్ని కూడా డెమొక్రటిక్ పార్టీ విడుదల చేసింది. తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని ప్రజలకు అందించటంలో ఫెయిల్ అయ్యారంటూ ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో హిల్లరీ వర్గం ట్రంప్ కు చెక్ పెడుతూ నివేదిక విడుదల చేసింది. చూస్తుంటే.. ఎన్నికలు పూర్తి అయ్యే లోపు ట్రంప్ మరెన్ని ఆరోపణలు చేస్తారో.. దానికి కౌంటర్ గా హిల్లరీ వర్గం మరెన్ని నివేదికల్ని విడుదల చేస్తుందో..?