Begin typing your search above and press return to search.
హిల్లరీ అదృష్టాన్ని మార్చనున్న 13,629 ఓట్లు
By: Tupaki Desk | 29 Nov 2016 7:10 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా విస్కాన్సిన్ రాష్ట్రంలో తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టనుండడం అత్యంత ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుండగా, అన్ని పార్టీలూ రీకౌంటింగ్ ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి విస్కాన్సిన్ లో హిల్లరీ కన్నా ట్రంప్ కు 27,257 ఒట్లు ఎక్కువగా వచ్చాయి. రీ కౌంటింగ్ లో కనీసం 13,629 వోట్లను తప్పుగా లెక్కించారని తేలితే - విస్కాన్సిన్ లో హిల్లరీ విజేతగా నిలుస్తారు. ఆ మేరకు ఓట్లు హిల్లరీకి వస్తాయి కాబట్టి, ట్రంప్ పై ఒక ఓటు తేడాతో హిల్లరీ నెగ్గుతారు. ఆ వెంటనే స్వల్ప మెజారిటీతో ట్రంప్ గెలిచిన మిషిగన్ (10,704) - పెన్సిల్వేనియా (70,010) రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్ కు పార్టీలు పట్టుబడతాయి. వాటిల్లోనూ రీకౌంటింగ్ తప్పనిసరి అవుతుంది. ఆ ఫలితాల్లోనూ తప్పు లెక్కలు ఉంటే - హిల్లరీదే విజయం అవుతుంది.
అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్ లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిషిగన్ లో 5,353 ఓట్లను - పెన్సిల్వేనియాలో 35,006 ఓట్లను హిల్లరీ అధికంగా తెచ్చుకుంటే మాత్రం ఫలితం తారుమారై అధ్యక్ష పీఠం ఆమెను వరిస్తుంది. అమెరికాలోని స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ, అతి కొద్ది ఓట్ల మెజారిటీతో ట్రంప్ ను గెలిపించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్ జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రక్రియలో హిల్లరీ క్లింటన్ కూడా పాల్గొనాలని నిర్ణయించారు. తాము విస్కాన్సిన్ రీకౌంటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్టు హిల్లరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ మేరకు మొత్తం 30 లక్షల ఓట్లను ఒక్కొక్కటిగా పరిశీలించనున్నట్లు రీకౌంటింగ్ కు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, తొలుత తాము రీకౌంటింగ్ ను కోరుకోలేదని క్లింటన్ ప్రచార బృందం ప్రతినిధి మార్క్ ఎలియాస్ వెల్లడించారు. ఓటింగ్ వ్యవస్థను హ్యాక్ చేశారనడానికి తమకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అయితే, ఇప్పుడు రీకౌంటింగ్ జరుగుతోంది కాబట్టి తాము ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు.
ఇదిలాఉండగా అక్రమ వలసలను అరికట్టేందుకు శాన్ డీగో - మెక్సికోలోని టిజువావాలను వేరు చేస్తున్న కంచె సమీపంలో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. తాను అధ్యక్షుడినైతే వలసదారులపై ఉక్కు పాదం మోపుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టు ఆయన అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి. దీంతో వలసదారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాలో అడుగు పెట్టేయాలని భావిస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అగ్ర రాజ్యానికి వలసలు పెరుగుతున్నాయి. సెంట్రల్ అమెరికా దేశాల్లోని నిరుపేదలు - కల్లోల జీవితం గడుపుతున్నవారు అక్రమంగా సరిహద్దులు దాటుతూ అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఇటీలి కాలంలో ఇవి బాగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికాలో చొరబడుతున్న వారిలో సగం మంది మెక్సికో నుంచి వస్తున్నవారే కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు మెక్సికో సరిహద్దులో 4.10 లక్షల మంది వలసదారులను అదుపులోకి తీసుకోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ కడతానని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/