Begin typing your search above and press return to search.
శ్రీనివాస్ హత్య..హిల్లరీ డిమాండ్ ఇదే
By: Tupaki Desk | 28 Feb 2017 8:40 AM GMTఅమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇటీవల కాన్సస్ లో జరిగిన జాత్యహంకార దాడిపై స్పందించారు. దేశంలో జరుగుతున్న దాడులపై ప్రెసిడెంట్ ట్రంప్ నోరు విప్పాలని ఆమె అన్నారు. కాన్సస్ బార్ లో జరిగిన కాల్పుల్లో ఓ శ్వేతజాతీయుడు హైదరాబాదీ యువకున్ని కాల్చి చంపిన విషయం తెలిసిందే. "శ్వేతజాతీయుడు ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందాడు. ఇదే దాడిలో మరో తెలుగు యువకుడు అలోక్ గాయపడ్డాడు. జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై దేశాధ్యక్షుడు ట్రంప్ స్పందించాలి' అని హిల్లరీ క్లింటన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డిమాండ్ చేశారు.
అమెరికాలో జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని అధ్యక్షుడికి చెప్సాల్సిన అవసరం లేదని, కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధ్యక్షుడు ముందుకు వచ్చి, ప్రజలకు అండగా మాట్లాడాలని హిల్లరీ అన్నారు. కాన్సస్ దాడి తర్వాత శ్రీనివాస్ భార్య సునయన అమెరికా మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా చంపిన అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సునయన మాట్లాడిన వీడియోను హిల్లరీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే కాన్సస్ లో జరిగిన కాల్పుల ఘటనపై దేశాధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. కానీ వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మాత్రం ఆ కాల్పుల ఘటనను హేట్ క్రైమ్ గా చిత్రీకరించడాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/