Begin typing your search above and press return to search.
తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ ప్రమాణం .. తోలి మహిళా సీజేగా రికార్డ్ !
By: Tupaki Desk | 7 Jan 2021 9:49 AM GMTతెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కోహ్లీకి ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, జస్టిస్ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలువడం విశేషం.
సీఎం కేసీఆర్‌తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ హిమా కోహ్లి బదిలీపై తెలంగాణ సీజేగా నియమితులయ్యారు. 1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్ హిమ కోహ్లీ 1979లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బీఏ ఆనర్స్ హిస్టరీలో డిగ్రీ అందుకున్నారు. తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో సభ్యురాలిగా నమోదై.. న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులైన పిమ్మట, 15 నెలల సర్వీస్ తర్వాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 29, 2007న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 20, 2019 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, జూన్ 30, 2020 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.