Begin typing your search above and press return to search.
అభ్యర్థుల్లో సగంమంది కోటీశ్వరులే
By: Tupaki Desk | 2 Nov 2017 8:10 AM GMTప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతోంది. వేల కోట్లు లేనిదే ఎన్నికల క్రతువు పూర్తికావడంలేదు. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి అధికారంలోకి రావడం.. వచ్చాక ఖర్చు చేసిన మొత్తానికి పదులు, వందల రెట్లు వెనకేసుకోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా దేశంలో మరో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. విజయం కోసం రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 338 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 158 మంది కుబేరులుండటం విశేషం.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న 68 మంది అభ్యర్థుల ఆస్తులు ఎనిమిదిన్నర కోట్లకు పైనేనని వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను బట్టి తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి చెందిన 68 మంది అభ్యర్థుల ఆస్తులు రూ.5.31 కోట్ల పైమాటే. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.46.78 లక్షలు.
ఆస్తుల సంగతి పక్కనపెడితే అభ్యర్థుల్లో 61 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమపై నేరారోపణలు ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వీరు పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ - 23 మంది బీజేపీ అభ్యర్థులు సహా 31 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. మొత్తం అభ్యర్థుల్లో సగం మంది కంటే ఎక్కువ మంది వయసు 50 ఏళ్లపైనే. 80 ఏళ్ల వృద్ధుడు ఎన్నికల బరిలో నిలిచాడు. అభ్యర్థుల్లో 63శాతం మంది గ్రాడ్యుయేట్లు. మొత్తం 338 మంది అభ్యర్థుల్లో కేవలం ఆరు శాతం మంది మాత్రమే 19 మంది మహిళలున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థులుగా కాంగ్రెస్ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ - బీజేపీ నుంచి ప్రేమ్ కుమార్ ధుమాల్ బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ధుమాల్ గెలుపు ఖాయమని, మరోసారి ఆయన్ను సీఎం పదవిలో చూడనున్నట్టు అమిత్ షా జోస్యం చెప్పారు. ఈ నెల 18న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.