Begin typing your search above and press return to search.
పిల్లోడే అయినా ఈటెలను సింఫుల్ గా ఎత్తేశాడే
By: Tupaki Desk | 4 March 2016 5:07 PM GMTఇప్పుడీ ఫోటో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో ఇద్దరు ప్రముఖులు ఉండటమే కాదు.. ఇలాంటి అరుదైన ఫోటో ఈ మధ్యకాలంలో చూడలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. సుదీర్ఘకాలం సాగిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను విడవకుండా ఆయన వెంటే సాగిన కొద్దిమందిలో ఆయన ఒకరు. కేసీఆర్ కష్టసుఖాల్లో ఆయన కీలకభూమిక పోషించారు.
ఈటెలలో ఇదో పార్శమైతే.. చూసేందుకు చిన్నగా కనిపించినా.. ఆయన ఎంత గట్టివాడన్న విషయం ఆయన మాటలు.. చేతలు చెప్పకనే చెబుతాయి. చాలా సింఫుల్ గా కనిపించే ఆయన వందల కోట్ల రూపాయిల ఆస్తిపరుడన్న విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాంటి ఈటెలను ఒక చిన్న పిల్లాడు చాలా ఈజీగా ఎత్తేయటం.. దానికి ఈటెల పరమానంద పడిపోవటం కనిపిస్తుంది.
ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? ఈటెలను అంత చనువుతో.. తేలిగ్గా ఎత్తేసిన బుడతడు ఎవరు? బుడతను తనను ఎత్తేస్తే.. ఈటెల పరమానందభరితుడైపోవటం ఎందుకు? లాంటి ప్రశ్నలకు ఒక్కముక్కలో సమాధానం చెప్పాలంటే.. ఆ పిల్లాడి పేరు చెబితే చాలు.. విషయం అంతా అర్థమైపోతుంది. ఇంతకీ ఆ పిల్లాడి పేరేమిటంటే.. హిమాన్షు. ఇంకా వెలగలేదా? అదేనండి.. ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడు.. మంత్రి కేటీఆర్ పుత్రరత్నం. ఇక.. చెప్పాల్సిందేముంది?