Begin typing your search above and press return to search.
'కాళీ' పోస్టర్: అమ్మవారితో సిగరెట్ తాగించడంపై హిందూ సంఘాల మండిపాటు..!
By: Tupaki Desk | 5 July 2022 3:14 AM GMTఇటీవల కాలంలో సినిమాల చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలు - దేవుళ్ళు మరియు దేవతలను కించ పరిచేలా సినిమాలు తీస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. తెలియక కొందరు ఇలాంటి తప్పులు చేస్తే.. మరికొందరు మాత్రం కావాలనే తమ చిత్రాలకు చీఫ్ పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ లో రణ్ బీర్ కపూర్ షూ ధరించి గుడిలోకి వెళ్లడం.. అలానే గంట కొట్టడం వంటి వాటిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరువక ముందే తాజాగా ''కాళి'' పేరుతో తెరకెక్కిన ఓ డాక్యుమెంటరీ సినిమాపై ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తం అవుతున్నాయి.
మధురై కు చెందిన ఫిలిం మేకర్స్ లీనా మణిమేకలై 'కాళీ' డాక్యుమెంటరీని డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్టుగా దీనికి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేయగా.. ఇది అతిపెద్ద వివాదానికి తెర లేపింది.
ఇందులో హిందూ దేవత కాళీ మాత వేషధారణలో ఉన్న నటి సిగరెట్ తాగుతున్నట్లు చూపబడింది. అంతేకాదు త్రిశూలంతోపాటు మరో చేత్తో LGBTQ+ కమ్యూనిటీకి ప్రతీకగా భావించే జెండా పట్టుకున్నట్లు కూడా ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
'కాళీ' పోస్టర్ పై హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే అమ్మవారు సిగరేట్ తాగుతున్నట్లు చిత్రీకరించడంపై భగ్గు మంటున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందూ దేవతలను మతాన్ని కించ పరిచేలా ఇలాంటి పోస్టర్ ను రూపొందించిన డైరెక్టర్ లీనాను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసే ఇలాంటి వాళ్లపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో ఆమె పై ఢిల్లీతో పాటుగా అనేక రాష్ట్రాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పై స్పందించిన హోం మంత్రిత్వ శాఖ 'గౌ మహాసభ' అధినేత అజయ్ గౌతమ్.. చిత్ర దర్శకనిర్మాతపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సినిమాపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు.
ఇకపోతే 'కాళీ' పోస్టర్ ను లీనా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ.. రిథమ్స్ ఆఫ్ కెనడా సెగ్మెంట్లో భాగంగా ఆగాఖాన్ మ్యూజియంలో దీన్ని లాంచ్ చేయడం సూపర్ థ్రిల్డ్ గా అనిపించిందని రాసుకొచ్చింది. అయితే దీనిపై ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.
హిందూ దేవతలను అవమానించడమే కాదు.. ఆమె కోట్లాది మంది మనోభావాలతో ఆడుకుంటున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. #ArrestLeenaManimekal అనే హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.
అయితే తన డాక్యుమెంటరీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిందని అనుకుందో ఏమో.. దర్శకురాలు లీనా మాత్రం ఈ వివాదాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదు. “నేను కోల్పోయేది ఏమీ లేదు. ఉన్నంత వరకు దేనికీ భయపడకుండా మాట్లాడే స్వరంతో ఉండాలనుకుంటున్నాను. దీనికి మూల్యంగా నా ప్రాణాన్ని ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తాను” అని లీనా పేర్కొంది.
'కాళీ' చూసిన తర్వాత మాట్లాడాలని ఆమె చెబుతోంది. అంతేకాదు సినిమా చూసిన తర్వాత మీ హ్యాష్ ట్యాగ్ ను 'లవ్ యూ లీనా మణిమెకలాయ్' గా మార్చుకుంటారని చెప్పడం గమనార్హం. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.