Begin typing your search above and press return to search.

గోమాంసానికి కౌంటర్ గా పందిమాంసమా?

By:  Tupaki Desk   |   20 Oct 2015 5:12 AM GMT
గోమాంసానికి కౌంటర్ గా పందిమాంసమా?
X
గత కొద్ది రోజులుగా దేశంలో కలకలం సృష్టిస్తున్న గోమాంసం వ్యవహారం ఇప్పుడు మరో కొత్త కోణంలోకి వెళుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా తమిళనాడులోని ‘ఇందు ముక్కల్ కట్చి- తమిళగమ్ ప్రకటించిన ప్రకటన చూస్తే ఈ వివాదం కొత్త రూపులోకి వెళుతుందన్న సందేహం కలగటం ఖాయం. గోమాంసాన్ని హిందు సంస్థలు వ్యతిరేకించటం.. గోమాంసం ఆరోగ్యానికి మంచిదంటూ వాటిని ఏర్పాటు చేస్తే విందులు నిర్వహించటంతో వాతావరణం వేడెక్కిపోయిన పరిస్థితి. కొన్నిచోట్ల ఈ వివాదం మరింత తీవ్రమై హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

గోమాంసంపై రాజకీయ పార్టీలు.. సంస్థలు చేపడుతున్న విందులకు నిరసనగా వాటికి ప్రతిగా పంది మాంసాన్ని నిరసనకారులకు పంపిణీ చేయాలన్న తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవటం ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది.

రాష్ట్రీయ హిందూ.. ఐఎంకేటీ.. హిందూ జన జాగృతి అధ్వర్యంలో ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేక భారత్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోమాంసంపై నిషేధం విధించాలన్న డిమాండ్ తోపాటు.. గో మాంసం తినే వారికి నిరసనగా పంది మాంసాన్ని పంపిణీ చేయాలన్న వివాదాస్పద ప్రకటనను చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి.. ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళుతుందన్నది పెద్ద టెన్షన్ గా మారింది.