Begin typing your search above and press return to search.

పాక్ లో హిందూ దేవాలయం అపవిత్రం

By:  Tupaki Desk   |   3 Feb 2016 12:02 PM GMT
పాక్ లో హిందూ దేవాలయం అపవిత్రం
X
హిందూమతంపై పాకిస్థాన్ లో జరిగే దాడులు అన్నీఇన్నీ కావు. హిందూ సంస్కృతి - సంప్రదాయాలు అన్నీ అక్కడ నిత్యం అవమానాలకు, దాడులకు గురవుతున్నాయి. తాజాగా పాకిస్ధాన్ లోని కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని ముగ్గరు ఆగంతుకులు అపవిత్రం చేశారు. పాకిస్థాన్ పత్రిక డాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.

కరాచీలో 60 ఏళ్ల నాటి దేవాలయం ఒకటి ఉంది. స్థానిక హిందువులు అక్కడ పూజలు జరుపుతారు. ఇటీవల గడ్డం పెంచి ,కుర్తా పైజామా ధరించిన సాయుధులైనా ముగ్గురు దుండగులు అందులో ప్రవేశించి మూత్ర విసర్జన చేసినట్లుగా తెలుస్తోంది. తొలుత అక్కడ ప్రార్ధనల్లో ఉన్న భక్తులను బయటకు వెళ్లిపోవాలని తుపాకులు చూపి ఆదేశించారు. వారంతా బయటకు వెళ్లిపోయిన తర్వాత దేవాలయం గర్భగుడిలోకి వెళ్లి అక్కడ కొలువైన సంతోషి మాత - భవానీ మాత విగ్రహలను అపవిత్రం చేశారు.

సంతానం లేని వారు ఇక్కడి దేవాలయంలో పూజలు చేస్తే పిల్లలు పుడతారన్నది భక్తుల విశ్వాసం.దీంతో ఎంతో మంది పూజలు చేస్తుంటారు.

ఇపుడు అపవిత్రం జరిగిన నేపధ్యంలో ,ఈ ఆలయంలోకి వచ్చి పూజలు చేసేందుకు భక్తులు భయపడుతున్నారని ఆలయ ధర్మకర్త సాక్షి మహరాజ్ తెలిపారు.60 ఏళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చిన తన తాత ఈ దేవాలయం నిర్మించారని ఆయన తెలిపారు.