Begin typing your search above and press return to search.
జూన్ 1 నుంచి ఆలయాల్లో దర్శనాలకి అనుమతి!
By: Tupaki Desk | 27 May 2020 7:30 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని ఆలయాల్లో దర్శనాలను నిలిపేశారు. కేవలం ఏకాంతంగా మాత్రమే ఆలయాల్లో అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే , ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నాలుగోదశ లాక్ డౌన్ నుండి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. అయితే, జన సాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ప్రార్ధనా మందిరాలను మాత్రం కేంద్రం మూసి ఉంచింది.
ఇకపోతే , రోజురోజుకి దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1 నుంచి కర్నాటక వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భక్తల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి కోటా శ్రీనివాస్ తెలిపారు. అలాగే,మే 31లోగా దేవాలయాల్లో అవసరమైన మార్పులు చేస్తామని.. దర్శనాల సమీపంలో ప్రామాణిక నిర్వహణ పద్దతులను పాటిస్తూ దర్శనాలు చేసుకోవచ్చని చెప్పారు.
దీని కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచే 52 దేవాలయాలకు సంబంధించి ఆన్ లైన్ సేవల బుకింగ్ ను ప్రారంభిస్తామన్నారు. కాగా, ఉత్సవాలు, పర్వదినాలను జరుపుకునేందుకు మాత్రం అనుమతి లేదని సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు. కాగా, కర్నాటకలో ఇప్పటి వరకు 2,282 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మహమ్మారితో పోరాడుతూ 722 మంది కోలుకోగా.. 44 మంది మరణించారు. ప్రస్తుతం కర్నాటకలో 1,514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.