Begin typing your search above and press return to search.

47శాతం హిందువులుగా మారారు

By:  Tupaki Desk   |   2 April 2021 6:48 AM GMT
47శాతం హిందువులుగా మారారు
X
అనాదిగా ఇతర మతాల్లోకి హిందువులు మారడమే కానీ.. వేరే మతస్థులు హిందుత్వంలోకి మారిన దాఖలాలు లేవు. ఎందుకంటే హిందూ సమాజం, మత గురువులు కూడా ఇలాంటి మత మార్పిడిలను పెద్దగా ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడం విశేషంగా మారింది.

కేరళలో 2020లో జరిగిన మత మార్పిడుల్లో 47శాతం మంది హిందూ మతంలోకి మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా దేశంలో మెజార్టీగా ఉన్న హిందువులు క్రిస్టియన్, ముస్లిం సహా వివిధ మతాల్లోకి మారిపోవడం కొన్ని ఏళ్లుగా జరుగుతోంది.కానీ కేరళలో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో హిందూమతంలోకి ప్రజలు మారడమే విశేషంగా మారింది.

కేరళలో బయటపడ్డ లెక్కల ప్రకారం.. గత ఏడాది 47శాతం మంది హిందూ మతంలోకి రావడం విశేషం. గత ఏడాది మొత్తం 506 మత మార్పిడులు నమోదు కాగా.. ఇందులో 241 మంది ఇస్లాం లేదా క్రిస్టియన్ల నుంచి హిందుత్వంలోకి వచ్చారని తేలింది.

ఇందులో అధికంగా క్రైస్తవ మతం నుంచి హిందుత్వంలోకి వచ్చిన వారున్నారు. ఇన్నాళ్లు హిందూ నుంచి క్రైస్తవంలోకి మారేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అవ్వడం విశేషం.

కాగా కేరళలో అధికారంలోకి వస్తే మత మార్పిడి నిరోధక బిల్లు తెస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ లెక్కలు చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది.