Begin typing your search above and press return to search.
నేను ఒక్క సైగ చేస్తే... హిందూపురం ఘటన పై బాలకృష్ణ
By: Tupaki Desk | 31 Jan 2020 7:40 AM GMTవికేంద్రీకరణ సెగ హిందూపురంలో బాలయ్యకు తగిలింది. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన బాలకృష్ణ కారుకు కొందరు నిరసన కారులు అడ్డుకున్నారు. అయితే, పోలీసుల జోక్యంతో బాలయ్య నిన్న వారి నుంచి క్షేమంగా బయట పడ్డారు. దీనిపై హైదరాబాదు కు వచ్చాక బాలయ్య స్పందించారు.
’’నాకు చట్టంపై గౌరవం ఉంది కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. నేను కనుక ఒక్క సైగ చేస్తే ఏమై ఉండేదో అందరికీ తెలుసు. పరిస్థితులు ఉద్రిక్తత కు దారి తీయకూడదు అనే నేను ఊరికే ఉన్నాను‘‘ అని బాలయ్య అన్నారు.
బాలయ్య స్పందన మరీ సినిమాటిక్ ఉందని చెప్పాలి. ఇదేమైనా సినిమానా సైగ చేస్తే నిరసనకారులను చుట్టుముట్టడానికి అవన్నీ రియాల్టీలో చెల్లవు కదా. వికేంద్రీకరణ కు బాలయ్య వ్యతిరేకం కాబట్టి... రాయలసీమకు రావల్సిన హైకోర్టు ను అడ్డుకుంటున్నదకు వారు నిరసన తెలిపారు. వారు వెళ్లి ఇంకో సినిమా హీరో వద్ద ఏం నిరసన తెలపలేదు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యతిరేకించడం వారికి ఇష్టం లేదు కాబట్టి వికేంద్రీకరణ జరిగితే రాయలసీమ కు ప్రయోజనం, మన ఎమ్మెల్యే కూడా మద్దతు ఇవ్వాలన్నది నిరసన కారుల డిమాండ్. బాలయ్య అయితే... తన స్టాండ్ మీద నిలబడాలి. లేదంటే తన అభిప్రాయం చెప్పాాలి. కానీ ఈ సైగ చేయడం అనే విధానం ఏంటో బాలయ్యే చెప్పాలి. అయినా... బాలయ్య నుంచి ఇలాంటి రెస్పాన్స్ సాధారణమే.