Begin typing your search above and press return to search.
బాలయ్యను వీడని పీఏ ప్రాబ్లెం
By: Tupaki Desk | 21 Feb 2017 9:13 AM GMTసీఎం చంద్రబాబునాయుడి బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు ఆయన పీఏ కారణంగా వచ్చిన ఇబ్బందులు ఇంకా తొలగలేదు. బాలయ్య పీఏ శేఖర్ కు వ్యతిరేకంగా హిందూపురం టీడీపీ నేతలంతా ఏకమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు - అంబికా లక్ష్మీనారాయణ తదితరులంతా కలిసి శేఖర్ పై పోరాటానికి అందరినీ సమీకరిస్తున్నారు. పేర్కొన్నారు. అంబికా లక్ష్మీనారాయణ నివాసంలో సోమవారం రాత్రి కొంతమంది కౌన్సిలర్లు - ఇతర నేతలు అంతా కలిసి సమావేశామయ్యారు. శేఖర్ డామినేషన్ ఏమాత్రం తగ్గలేదన్నది వారి ఆరోపణ.
అధికార పార్టీలో ఉన్నా తమ పనులు జరగడంలేదని వారంతా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని ఆ సమావేశంలో డిసైడ్ చేశారు. బాలయ్య పీఏ శేఖర్ ను నియోజకవర్గంలోకి రానివ్వకుండా చూడాలని కొంతమంది నాయకులు అభిప్రాయపడ్డారు. శేఖర్ కొంతమందికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, అయితే ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నారు.
కాగా.. ఈ సమావేశంలో నేతల నుంచి బాలయ్యపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. బాలయ్య తీరు కూడా బాగోలేదని.. ఏమీ పట్టించుకోకుండా మొత్తం శేఖర్ చేతిలో పెట్టడంతోనే ఇలాటి పరిస్థితి వచ్చిందని.. ఇంత జరిగినా శేఖర్ నే బాలయ్య నమ్ముతున్నట్లుగా ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారని సమాచారం. చూడబోతే శేఖర్ వ్యవహారం బాలయ్యకు వచ్చే ఎన్నికల్లో దెబ్బకొట్టే ప్రమాదం కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/