Begin typing your search above and press return to search.
హిందువులకు - యెస్ బ్యాంక్ కు లింకు..అందుకే ఈ ప్రమాదం
By: Tupaki Desk | 8 March 2020 12:38 PM GMTఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ పై వస్తున్న రోజుకో వార్తలు వివిధ వర్గాల్లో కలవరం కొనసాగిస్తుంటే...తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఈ దివాళలో మరో కొత్త కోణం ప్రస్తావించారు. సహజంగా బీజేపీ వ్యక్తం చేసే అభిప్రాయాలనే పేర్కొంటూ తాజాగా ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. దేశంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ బీజేపీ - హిందూ సంస్థలు ప్రచారం చేస్తుండగా అదే డైలాగ్ తో ప్రైవేటు బ్యాంకుల సంక్షోభానికి లింక్ పెట్టి మోదీ పాలనపై మండిపడ్డారు. బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారని ఆయన ఆరోపించారు.
ఎస్ బ్యాంకులో మెజార్టీ ఖాతాదారులు హిందువులేనని...తాజా ప్రక్రియతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొందని సావంత్ అన్నారు. బ్యాంకులో 18238 మంది సిబ్బంది ఉన్నారని - దాదాపు వారంతా హిందువులేనని - ప్రస్తుతం వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒడిశాలోని జగన్నాథ దేవాలయానికి చెందిన రూ.545 కోట్లు కూడా ఎస్ బ్యాంకులోనే డిపాజిట్ చేశారని - చివరికి భగవంతుడి సొమ్ములకు కూడా రక్షణ లేకుండా పోయిందని సావంత్ అన్నారు. ఎస్ బ్యాంకుపై ఆర్ బీఐ మారిటోరియం విధించడానికి ముందు రోజు వడోదర స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కంపెనీ రూ.265 కోట్లు విత్ డ్రా చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నేత అన్నారు. గుజరాత్ ప్రజల కోసమే తప్ప ప్రధాని మోదీకి - హోం మంత్రి అమిత్ షా కి దేశ ప్రజల పట్ల ఎలాంటి బాధ లేదనే ఈ విత్ డ్రా లతో అర్థమవుతోందని సావంత్ ఆరోపించారు.
బ్యాంకుల కేంద్రంగా జరుగుతున్న ఆర్థిక కష్టాల వల్ల నష్టపోతోంది హిందూవులేనని సావంత్ తెలిపారు. బ్యాంకులను లూటీ చేసి పరారైన విజయ్ మాల్యా - నీరవ్ మోదీ - మెహుల్ చోక్సీలతో నష్టపోయింది మెజారిటీ హిందువులేనని - లూటీ అయిన సొమ్ముల్లో ఎక్కువ సొమ్ములు వారివేనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విశ్లేషించారు. పంజాబ్, మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకు స్కామ్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలా ప్రైవేటు బ్యాంకుల సంక్షోభంతో మోదీ పాలనలో హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారని సచిన్ సావంత్ ఎద్దేవా చేశారు.