Begin typing your search above and press return to search.
ఏచూరీ సార్!... ఈ విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా?
By: Tupaki Desk | 3 May 2019 1:38 PM GMTవామపక్ష దిగ్గజం - సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ ఇప్పుడు పెద్ద రచ్చకు కేంద్ర బిందువుగా మారారు. కమ్యూనిస్టు నేత అయినా పెద్దగా వివాదాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగానే రాజకీయాలు చేసుకుంటూ వస్తున్న ఏచూరీ... ఇప్పుడు ఓ పెద్ద రచ్చకే తెర లేపేశారు. హిందువులను హింసావాదులుగా అభివర్ణించిన ఏచూరీ... హిందూ గ్రంథాలు రామాయణం, మహాభారతాల్లోనూ బోలెడంత హింసం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రంథాలు హింసాత్మక ఘటనలతోనే నిండి ఉన్నాయని చెప్పిన ఆయన... హిందువుల్లో హింసావాదులు లేరని చెప్పగలరా? అంటూ ఓ పెద్ద సవాల్ ను కూడా విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి తూటాల్లాంటి మాటలు వస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీల నుంచి అయితే ఈ తూటాల్లాంటి మాటల గాఢత మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే వివాదాలకు ఆమడంత దూరంలో ఉంటూ వస్తున్న ఏచూరీ... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బీజేపీ, ఆ పార్టీలో అతివాదులుగా ముద్రపడిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ లను టార్గెట్ చేసిన ఏచూరీ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులను హింసావాదులుగా అభివర్ణించిన ఏచూరీ... రామాయణం, మహాభారతాల్లో హింసాత్మక ఘటనలే కోకోల్లుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర మతాల్లో హింసకు పాల్పడేవారు ఉన్నారని చెబుతున్న వాళ్లు... హిందూ మతంలో హింసావాదులు లేరని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని కూడా ఏచూరీ ప్రశ్నించారు. ముఖ్యంగా ఇతర మతాల్లో హింసను ప్రేరేపించే వాళ్లు ఉన్నారని చెబుతున్న హిందూ వాదులు... తమ మతంలో మాత్రం అలాంటి హింసావాదులు లేరని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇక ఆ తర్వాత భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాద్వీ ప్రజ్ఞాను టార్గెట్ చేసిన ఆయన... ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న ప్రజ్ఝా హిందువులు హింసను నమ్మరని చెప్పారని గుర్తు చేశారు. అయితే రామాయణ ,మహాభారతం లాంటీ పురాణాల్లో హింసతో కూడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పేర్కోన్నారు. హిందువుల ఓట్ల కోసమే... ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని బీజేపీ పోటిలోకి దింపిందని సంచలన వ్యాఖ్య చేశారు. హిందుత్వా అనేది ఒక రాజకీయ ఎజెండాగా మారిపోయిందని కూడా ఏచూరీ అన్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే హిందుత్వ ఎజెండాను తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. మొత్తంగా ఏచూరీ పెద్ద రచ్చకే తెర లేపారన్న వాదన వినిపిస్తోంది.