Begin typing your search above and press return to search.

కరోనా వేళ పాక్‌ లో హిందువుల ఆకలి చావులు

By:  Tupaki Desk   |   30 March 2020 5:06 PM GMT
కరోనా వేళ పాక్‌ లో హిందువుల ఆకలి చావులు
X
కరోనా వైరస్‌ పాకిస్థాన్‌ లో అత్యంత స్పీడ్‌ గా విస్తరిస్తుంది. ఇప్పటికే 1600 లకు పైగా పాజిటివ్‌ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. దాంతో పరిస్థితి చాలా సీరియస్‌ గా ఉందని డబ్ల్యూ హెచ్‌ ఓ హెచ్చరికలు జారీ చేసింది. అయినా కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఉద్దేశ్యంతో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ లాక్‌ డౌన్‌ ను ప్రకటించడం లేదు. కాని దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ను విధిగా పాటిస్తున్నాయి. ఈ సమయంలో స్థానికంగా నిత్యావసరాల కొరత ఏర్పడుతుందట.

ప్రభుత్వం రేషన్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. అయితే పాక్‌ లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు అక్కడ ప్రస్తుతం గడ్డు పరిస్థితి నడుస్తోంది. మామూలుగానే స్థానిక ముస్లీంలు హిందువులపై కక్ష సాధిస్తూ ఉంటారు. హిందువులపై పాక్‌ లో తరచు దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో రేషన్‌ షాపుల వద్ద షాపింగ్‌ మాల్స్‌ వద్ద హిందువులను గెంటి వేస్తున్నారట. హిందువులకు రేషన్‌ అందకుండా కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారట.

మీరు మా దేశంలో ఉండవద్దు. ఈ సమయంలో మీకు మోడీనే రేషన్‌ ఇస్తాడంటూ కొందరు పిచ్చి ప్రేలాపణలతో స్థానిక హిందువులను అవహేళన చేస్తూ వారికి రేషన్‌ అందకుండా చేస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఈ విషయమై పాక్‌ పై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో మత వివక్ష జాతి వివక్షలు అస్సలు పనికిరావంటూ హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్‌ లో హిందువులకు రక్షణ కల్పించకుంటే అక్కడ హిందువుల ఆకలి చావులు చూడాల్సి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు.