Begin typing your search above and press return to search.
కలకలం రేపుతున్న వినాయకుడి మీట్ యాడ్
By: Tupaki Desk | 6 Sep 2017 7:23 AM GMTవ్యాపారం కోసం ఆకర్షణీయమైన ప్రకటనలు తయారు చేయటం పాత పద్దతిగా మారింది. తన ఉత్పత్తులను వివాదంగా మార్చుకొని.. బోలెడంత చర్చకు తెర తీయటం ద్వారా ఫేమస్ అయ్యే దరిద్రపు వ్యూహాన్ని కొన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఈ ఛండాలమైన ఐడియా కంపెనీలదో.. లేక వారి ఉత్పత్తుల్ని ఫేమస్ చేస్తామని చెప్పే యాడ్ కంపెనీలదో కానీ.. వీరి చేష్టల కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తరచూ మనస్తాపానికి గురయ్యే పరిస్థితి.
తాజాగా ఆ తరహాలోనే తయారు చేసిన ఒక వాణిజ్య ప్రకటన ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన మీట్ అండ్ లైవ్ స్టాక్ ఆస్ట్రేలియా అనే కంపెనీ ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్య కంపెనీగా దీనికి పేరుంది. ఈ సంస్థ రూపొందించిన ఒక ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ యాడ్ చూసిన హిందువులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
మాంసం తినేందుకు అందరికంటే ముందుగా టేబుల్ మీద కూర్చున్న గణేష్ మహారాజ్‌ను చూపించటంపై పలువురు తప్పు పడుతున్నారు. ఈ ప్రకటనలో వివిధ మతాలకు చెందిన పూజ్యులు ఉండటం గమనార్హం. ఒక ఇండియన్ టేబుల్ మీద మాంసం తినేందుకు వినాయకుడు.. జీసస్.. బుద్ధ తదితరులు కూర్చున్నట్లుగా చూపిస్తారు. చివరకు మేమంతా మాంసం తింటామన్నట్లు ఉండేలా వివాదాస్పదమైన ట్యాగ్ లైన్ తో ఈ యాడ్ ను రూపొందించారు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఈ యాడ్ లోని అంశాల్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇందులో అభ్యంతర అంశాల్ని పరిశీలించే పనిలో పడింది.
ఈ యాడ్ ద్వారా నాన్ వెజ్ ఫుడ్ ను ప్రమోట్ చేయటమే లక్ష్యమని చెబుతున్నారు. అయితే.. ఈ ప్రకటనను ఆస్ట్రేలియాలోని ఇండియాన్ కమ్యూనిటీకి చెందిన నితిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉండే యాడ్ ను తప్పు పట్టి.. ఇలాంటి మార్కెటింగ్ వ్యూహాలు మంచివి కావన్నారు. కలకలం రేపటంతో పాటు పలువురు తప్పుపడుతున్న ఈ యాడ్ లోని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ బ్యూరో విచారణ నిర్వహిస్తోంది.