Begin typing your search above and press return to search.
ఏపీలో ఘోరం: 35కి చేరిన మృతుల సంఖ్య
By: Tupaki Desk | 22 Jan 2017 3:55 AM GMTఏపీలో మహా విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడో కానీ వినని ఘోర రైలు ప్రమాదాలు ఇప్పుడు తరచూ చోటు చేసుకుంటున్నాయి.తాజాగా అలాంటి దారుణం ఏపీలో చోటు చేసుకుంది. జగదల్ పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ శనివారం రాత్రి 11.30 గంటల వేళలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఒక ఏసీ.. నాలుగు జనరల్.. రెండు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 35 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఘటనాస్థలిలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ.. వేగంగా వెళుతున్న రైలు ఒక్కసారి పట్టాలు తప్పటంతో.. ప్రమాదం గురించి తెలిసే లోపే పలువురి ప్రాణాలు పోయాయి. ఈ ఘటనలో బోగీలు చెల్లాచెదురు కాగా.. బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. బోగీల్లోఇరుక్కుపోయిన మృతదేహాల్ని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పట్టాలు తప్పిన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల్ని బయటకు తీసుకొస్తుననారు.గాయపడిన క్షతగాత్రులకు సహాయచర్యలు చేపడుతున్నారు. చెల్లాచెదురుగా పడిన బోగీలు.. వస్తువులతో ఘటనాస్థలంలో పరిస్థితి భయానకంగా ఉంది. తమ వారి కోసం వెతుకుతున్న వారి ఆర్తనాదాలు..ఆయినవారిక లేరన్న ఆవేదన ఆప్రాంతాన్ని శోకసంద్రంగా మార్చేసింది.
ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సహాయక బృందాలు స్పందించాయి. బోగీల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయ సిబ్బంది శ్రమిస్తోంది. గాయపడిన వారిని పార్వతీపురం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి సహాయబృందం హుటాహుటిన బయలుదేరింది. రాయగఢ్ కలెక్టర్.. జేసీ.. విజయనగరం ఓఎస్డీ తదితర ఉన్నతాధికారులు ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.
అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదం ప్రయాణికులకుషాకింగ్ గా మారింది. చుట్టూ చిమ్మ చీకటి నెలకొని ఉండటంతో సహాయక చర్యలు చేపట్టటానికి కాస్త ఆలస్యమైంది. వణికేచలిలో బాధితులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకబస్సుల్ని ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా చర్యలుచేపట్టారు. ప్రమాదానికి గురైన ఏడు బోగీల్లో ఎస్ 9 తీవ్రంగా దెబ్బతింది. కొంతలో కొంత సానుకూలాంశం ఏమిటంటే.. పట్టాలు తప్పిన హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ ఉన్న ట్రాక్ పక్కనే మరో ట్రాక్ మీద గూడ్స్ రైలు ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. పట్టాలు తప్పిన రైలు బోగీల్ని గూడ్స్ రైలు ఆపింది. ఒకవేళ.. గూడ్స్ రైలు లేనిపక్షంలో.. ప్రమాదం మరింత ఎక్కువగా ఉండేది.
ఈ ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం 0891-2746344, విజయనగరం 08922-221202. ఈ రెండు నెంబర్ల నుంచి మరింత సమాచారం పొందే వీలుంది. హీరాకుడ్ ప్రమాద నేపథ్యంలో రాయగఢ్ – భువనేశ్వర్ మధ్యన పలు రైళ్లను దారి మళ్లించారు. అదే సమయంలో ఆంధ్రా.. రాయగఢ్ మధ్య రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదంపై రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లాలోని చినకుదమకు చెందిన ముగ్గురు మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.
విషాదకరమైన విషయం ఏమిటంటే.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మూడు చోట్ల రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాకుంటే.. హీరాకుడ్ ప్రమాదం పెను విషాదంగా చెప్పాలి. మరో రెండు ఉదంతాలు చూస్తే.. తిరుపతి రైల్వేస్టేషన్లో వాస్కోడిగామా ఈ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి వాస్కోడిగామా వెళ్లాల్సిన రు ప్రయాణానికి సిద్ధం చేస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్ తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం చోటుచేసుకునే వేళలో.. ట్రైన్ లో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం జరగలేదు. మరో ఘటనలో రాజస్థాన్ లోని జైసల్వేర్ లో రాణిఖేత్ ఎక్స్ ప్రెస్ రైలు లోని 10 బోగీలు పట్టాలు తప్పాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/