Begin typing your search above and press return to search.
ఒక్క రోజులో ఆయన సంపాదన రూ.1.82 లక్షల కోట్లు !
By: Tupaki Desk | 10 March 2021 2:30 PM GMTషేర్ మార్కెట్ ఓడలను బండ్లను చేస్తుంది.. బండ్లను ఓడలు చేస్తుందన్నది పాతమాట. ఈ మధ్య ట్రెండ్ మారింది. దిగ్గజ కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటూ సంపదను పోగు చేసుకుంటున్నాయి. స్పేస్ ఎక్స్, టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలన్ మస్క్ సంపాదన ఒక్క రోజులోనే లోనే దాదాపు రూ. 1.82 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయింది. టెస్లా షేర్లు మార్కెట్లో బలంగా ట్రేడవుతున్నాయి. ఒక్కరోజే టెస్లా షేర్ 20 శాతం పెరగడం తో భారీగా ఆర్జించారు. దీనితో ప్రస్తుతం ఎలన్ మస్క్ మొత్తం సంపాదన రూ. 12.70 లక్షల కోట్లకి చేరింది. దీనితో బిలినియర్స్ ఇండెక్స్ జాబితాలో మస్క్ తోలి స్థానంలో కొనసాగుతున్న జెఫ్ బెజోస్ కి చేరువయ్యారు. మరోవైపు అమెజాన్ కూడా లాభాల పంట పండించడంతో జెఫ్ బెజోస్ ఒక్కరోజే 600 కోట్ల డాలర్లు ఆర్జించాడు.
అతనికి టెస్లాలో ఐదోవంతు షేర్లు, స్పేస్ ఎక్సోప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్‌లో 14.6 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. టెస్లా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను ఇప్పటికే అధిగమించింది. టెస్లా మూడో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో షేర్ల ధరలు పెరుగుతున్నాయి. చైనాలో మోడల్ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కంపెనీ 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనాలు ఉన్నాయి.