Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ గురించి గర్వపడటం లేదన్న ఆయన తండ్రి

By:  Tupaki Desk   |   3 Aug 2022 1:30 AM GMT
ఎలన్ మస్క్ గురించి గర్వపడటం లేదన్న ఆయన తండ్రి
X
టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకు గురించి గర్వపడటం లేదని.. ఎలోన్ మస్క్ తన కెరీర్ పురోగతిపై అసంతృప్తిగా ఉన్నానని ఎర్రోల్ మస్క్ చెప్పాడు. ఆస్ట్రేలియన్ రేడియో ది కైల్ -జాకీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎలోన్ సాధించిన విజయాల గురించి గర్వపడుతున్నావా అని 76 ఏళ్ల ఆయన ఆయన తండ్రిని అడిగగా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. "నా కొడుకు ఎలన్ మస్క్ గురించి గర్వపడడం లేదు. మీకు తెలుసా? మేము చాలా కాలం నుండి చాలా పనులు చేస్తున్న కుటుంబం. మేము హఠాత్తుగా ఏదో చేయడం ప్రారంభించినట్లు కాదు" అని ఎర్రోల్ సమాధానం ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్‌కి తన కుమారుడు ఎలన్ పై పంచ్ చేసే అవకాశాన్ని మాత్రమే వాడుకోలేదు.. ఎలోన్ గురించి చర్చించడంతో పాటు, ఎర్రోల్ ఈ ఇంటర్వ్యూలో అతడు తన సవతి కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడన్న విషయాలను ఓపెన్ గానే చర్చించాడు.

బెజుడెన్‌హౌట్ కంటే 42 సంవత్సరాలు పెద్ద ఎర్రోల్. ఎర్రోల్ ఆమెకు నాలుగేళ్ల వయసులో సవతి తండ్రి అయ్యాడు. అతను తాజాగా ఆమెతో సంబంధం పెట్టుకొని ఏకంగా ఇద్దరు పిల్లలను కనడం సంచలనమైంది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "మనం భూమిపై ఉన్న ఏకైక విషయం పునరుత్పత్తి కోసమే." అంటూ వావివరసలు తమకు లేవని ఎర్రోల్ మస్క్ అన్న మాటలు దుమారం రేపాయి. "నేను నా సవతి కూతురుతో కాపురం చేయకపోవడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదు," అన్నారాయన.

ఎర్రోల్ మూడేళ్ల క్రితం 35 ఏళ్ల బెజుడెన్‌హౌట్‌తో డేటింగ్ మొదలుపెట్టి ఇద్దరు పిల్లలను కన్నాడు. బెజుడెన్‌హౌట్‌ తల్లితో కూడా ఎర్రోల్ చాలా కాలం వివాహ సంబంధాన్ని కొనసాగించాడు. 2018లో ఎర్రోల్‌కు బేబీ ఇలియట్ రష్, రుషి అనే ఇద్దరు పిల్లలు కలిగారు. ఇప్పుడు ఐదుగురు, బెజుడెన్‌హౌట్‌ తన కంటే 41 సంవత్సరాలు పెద్దవాడు. నాలుగేళ్ల నుండి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.

టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఇటీవల తన తండ్రి నిర్వాకంపై హాట్ కామెంట్ చేశాడు. తన దక్షిణాఫ్రికా ఇంజనీర్ తండ్రికి బెజుయిడెన్‌హౌట్‌తో ఒక బిడ్డ ఉందని తెలిసినప్పుడు "వెనుకబడిపోయాడు" అని సెటైర్ వేశాడు. తాను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు తండ్రితో నివసించానని.. ఇప్పుడు పెద్దగా సంబంధాలు లేవని ఎలన్ మస్క్ అన్నాడు.

ఎర్రోల్ బెజుడెన్‌హౌట్ తల్లి హీడ్‌ను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా ఇద్దరు పిల్లలను కన్నాడు.