Begin typing your search above and press return to search.

అతడి ఎత్తు 9.6 అడుగులని ప్రచారం.. తీరా కొలిచి చూస్తే..!

By:  Tupaki Desk   |   3 Jan 2023 3:27 AM GMT
అతడి ఎత్తు 9.6 అడుగులని ప్రచారం.. తీరా కొలిచి చూస్తే..!
X
ప్రపంచంలో వింతలు.. విశేషాలన్నీంటిని గిన్నీస్ బుక్ రికార్డుల్లో నమోదవుతూ ఉంటాయి. ఇప్పటికే పలువురి పేరిట రికార్డులు ఉండగా వాటిని తలదన్నేలా మరొకరు ఉన్నారనే ప్రచారం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుందనే సంగతి తెల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తైన(పొడవైన) వ్యక్తిగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్(40) పేరిట ఉంది.

గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారంగా సుల్తాన్ కోసెన్ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. అయితే అతడి కంటే ఎక్కువ ఎత్తులో ఘనాలో ఓ వ్యక్తి ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఘనాకు చెందిన ఓ ఆస్పత్రి నిర్వాహకులు సులేమానా అబ్దుల్ సమేద్‌(29) అనే వ్యక్తి 9 అడుగుల 6 అంగుళాలు (2.89 మీటర్లు) ఉన్నట్లు వెల్లడించింది.

ఈ విషయం నిజమే అయితే అతడే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా నిలుస్తాడు. కానీ వారి వద్ద ఎత్తును కొలిచే సరైన సాధనాలు లేకపోవడంతో ఆ విషయాన్ని వైద్య సిబ్బంది నిక్కచ్చిగా చెప్పలేకపోయారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ అబ్దుల్‌కు జిగాంటిజం (అసాధారణ పెరుగుదల) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారితం అయిందన్నారు.

ఎత్తుగా ఉండటం వల్ల ఎదురయ్యే సమస్యలను వినిపించేందుకు అతను నెలవారీ వైద్య పరీక్షలకు హాజరు అవుతారని తెలిపారు. అలాగే ఒకసారి వైద్య పరీక్షకు వెళ్లినప్పుడు ఎత్తు కొలిచే స్కేలు పక్కన నిలబడాల్సిందిగా అతన్ని నర్సు కోరింది. అయితే అతడు ఆ స్కేల్ కంటే ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. దీంతో వైద్య సిబ్బంది గందరగోళానికి గురయ్యారు.

అతడి ఎత్తును కొలిచేందుకు మరో వ్యక్తి సహాయంతో నర్సు అబ్దుల్ పొడవును కొలిచేందుకు యత్నించగా సాధ్యపడలేదు. ఆ తర్వాత ఒక తర్వాత ఒక స్తంభాన్ని ఎత్తుగా కొలిచే దాని సహాయంతో అతని పొడవుపై వైద్య సిబ్బంది ఒక అంచనాకు వచ్చారు. అతడి ఎత్తు 9 అడుగుల 6 అంగుళాలని ప్రచారం కావడంతో గిన్నిస్ బుక్ నిర్వాహాకులు అతడి వద్దకు వెళ్లారు.

అబ్దుల్ ఎత్తును కొలిచే ప్రయత్నం చేశారు. తీరా ఎత్తును టేసు సహాయంతో కొలువగా 7 అడుగుల 4 అంగుళాలు అని తేలింది. ప్రస్తుతం ప్రపంచంలో బ్రతికి ఉన్న వ్యక్తుల్లో టర్కీకి చెందిన వ్యక్తి 8 అడుగుల 2.8 అంగుళాలు ఉన్నాడు. అతడి వయస్సు 40 సంవత్సరాలు. అయితే అబ్దుల్ వయస్సు మాత్రం 29 ఏళ్ళు.

ప్రతి మూడు నెలుగు నెలలకొకసారి అబ్దుల్ హైట్ పెరుగుతూనే ఉంటాడట. దీంతో అతడు రాబోయే రోజుల్లో గిన్నిస్ రికార్డుకు చేరువయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం టర్కీకి చెందిన వ్యక్తినే ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తిగా ఉన్నాడు. కాగా అబ్దుల్ ను స్థానికంగా ‘అవుచే’ అని ముద్దుగా పిలుస్తుంటారు. దీని అర్థం ‘ముందుకు సాగు’ అని అర్థం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.