Begin typing your search above and press return to search.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తయారీకి కాపీ కొట్టారా?
By: Tupaki Desk | 3 Dec 2015 3:54 PM GMTస్వేచ్ఛా దేవతగా చెప్పుకొని ప్రపంచంలోని ప్రతిఒక్క స్వేచ్ఛా పిపాసి గొప్పగా చెప్పుకునే అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలు కథ బయటకు వచ్చింది. ప్రపంచంలోని సేచ్చకు పర్యాయపదంగా చెప్పుకునే ఈ విగ్రహం కాపీ అని తేల్చారు. అప్పుడెప్పుడో ఫ్రెంచ్ శిల్పి తయారు చేసిన విగ్రహానికి నకలే అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా చెబుతున్నారు.
కుడిచేతితో కాగడా పట్టుకొని ఠీవీగా నిలుచునే స్టాట్యూఆఫ్ లిబర్టీ విగ్రం వర్జినల్ విషయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దీని అసలు విగ్రహం 1855-56 మధ్య ఈజిప్ట్ లో ప్రయాణించిన ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టీ బర్థోల్దీ రూపొందించినట్లుగా చెబుతున్నారు. చరిత్రలో నిలిచిపో్యేలా భారీ విగ్రహాల్ని చెక్కటంలో ఆసక్తి ఉన్న ఆయన్ను సూయిజ్ కెనాల్ కు ఒక లైట్ హౌస్ ను తయరు చేయాలని ఈజిఫ్ట్ సర్కారు కోరిందట.
దీనికి స్పందించిన ఆయన.. కాగడా పట్టుకొని కాపాలా కాస్తున్న ఒక అరబ్ మహిళా రైతు రూపంలో లైట్ హౌస్ ను నిర్మించేందుకు ఒక డిజైన్ రూపొందించారు. దానికి దగ్గరగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి దగ్గర పోలికలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కాకుంటే.. అరబ్ మహిళకు సంబంధించి ఎడమ చేతితో కాగడా పట్టుకొని ఉంటే.. అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం కుడి చేత్తో కాగడా పట్టుకొని ఉంటుంది.మిగిలినదంతా దాదాపుగా ఒకటేనని చెబుతున్నారు. మరి.. దీనిపై అమెరికా మేధావులు ఏమని సెలవిస్తారో..?