Begin typing your search above and press return to search.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ చారిత్రక నిర్ణయం.. మళ్లీ ఆయనకే పట్టం!
By: Tupaki Desk | 9 Nov 2021 3:57 AM GMTచైనా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి .. ఆ దేశ అధ్యక్షుడు షీ జింగ్ పింగ్. ఒకప్పుడు చైనా అంటే కేవలం అధిక జనాభా అనేద దగ్గర నుంచి... నేడు చైనా అంటే ప్రపంచానికే ఓ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ అనేంతలా గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి జింగ్ పింగ్. కేవలం ఈ తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలోనే కాదు. దేశ భద్రత విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాలతో పరాక్రమం చూపిస్తూ.. అగ్రరాజ్యమైన అమెరికాకు సైతం హడలు పుట్టించేలా ఎదిగారు. పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాల అన్నింటిని చైనాలో భాగం చేసేందుకు.. చేతనైనన్నీ పనులు చేస్తున్నారు. ఇతర దేశాల భూభాగాలపై కన్నేసి.. వాటిని సొంతం చేసుకునేందుకు యుద్ధతంత్రాలు రచించడంలో కూడా ఆయన కు ఆయనే సాటిగా నిలిచారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తిని చైనాలోని కమ్యునిస్ట్ పార్టీ ఇప్పటికే రెండు సార్లు దేశాధ్యక్షునిగా సేవలందించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే మరోసారి ఆయన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇదే జరిగిదే మూడోసారి ఆ అవకాశం దక్కే మూడో నేతగా జింగ్ పింగ్ నిలవనున్నారు. ఇందుకు సంబంధించిన కీలక తీర్మానాన్ని చైనా కమ్యూ నిస్ట్ పార్టీ కు చెందిన నాలుగు వందల మంది సెంట్రల్ కమిటీలో ఉండే ఆ పార్టీ నేతల ఆమోదం తెలుపనున్నట్లు చైనా మీడియా ఇప్పటికే కోడై కూస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఇలాంటి చారిత్రక నిర్ణయాలు ఇదివరకు కేవలం రెండు సార్లు మాత్రమే జరిగాయి.
చైనా కాంక్లెవ్ సమావేశాలు 400 సభ్యులతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఇందులో చివరి రోజు ఓ చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జిన్ పింగ్ కు మూడోసారి పగ్గాలు చేతికివ్వనున్నట్లు తెలిపారు. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అంతటి ప్రభావశీలమైన వ్యక్తి జిన్ పింగ్ అని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఈయన జీవితకాలం కొనసాగే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి అధ్యక్షుడు జిన్ పింగ్ చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు కొనియాాడారు. అయితే ఈ సమావేశాల్లో జిన్ పింగ్ కు మరోసారి పట్టం కట్టబెట్టనున్నారని తెలిపారు. వందేళ్ల చైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఈ చారిత్రక నిర్ణయం ఒక మైలు రాయి అని చెప్పవచ్చన్నారు. ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే చారిత్రక తీర్మానాలు ప్రవేశపెట్టారని... జిన్ పింగ్ కు మరోసారి అధికారం కట్టబెట్టే ఈ నిర్ణయం మూడోది అని వారు చెబుతున్నారు.
ఇదివరకు 1945లో మావో-సాంస్కృతిక తీర్మానం, 1981లో డెంగ్-చారిత్రక తీర్మానాలను ప్రవేశపెట్టారు. అయితే మూడోసారిగా ప్రవేశపెట్టనున్న ఈ చారిత్రక నిర్ణయం జిన్ పింగ్ కు శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగే అధికారాన్ని సైతం కట్టబెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీపీసీపై జిన్ పింగ్ కు ఉన్న పట్టు, దేశాన్ని నడిపించడంలో ఆయనకు ఉన్న శక్తిసామర్థ్యాల వల్లే మరోసారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అయితే పార్టీ తదుపరి నాయకత్వం గురించి ప్రస్తుతం చర్చించే అవకాశం లేదని తెలిపారు. చైనా అధ్యక్షుడు రెండు సార్లకు మించి పోటీ చేయకూడదనే నిబంధన ఇదివరకు ఉండేది. 2018లో దీనిని జిన్ పింగ్ సవరించారు. వచ్చే ఏడాదిలో ఈయన రెండోసారి అధ్యక్ష పదవి ముగియనుంది. మళ్లీ తానే అధికారంలో కొనసాగాలని ఆశిస్తున్నారు. అందుకు తగినవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిన్ పింగ్ మరోసారి ఎన్నికపై కాంక్లైవ్ చివరి రోజు స్పష్టత రానుంది. సమావేశాల చివరి రోజు ఇలాంటి కీలక నిర్ణయాలు వెల్లడిస్తారు. అందుకే జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష పదవిపై క్లారిటీ రానుంది. ఇకపోతే మిగతా పదవుల్లో ఉన్నవారు మాత్రం పోయి.. కొత్త వాళ్లు ఎన్నికవుతారని తెలుస్తోంది.
సీపీసీ అధ్యక్షుడితో పాటు ఇతర నాయకుల వయోనిబంధనపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. త్వరలో ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చైనా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 68ఏళ్లు దాటినవారు సీపీసీలో అనధికారంగా పదవి విరమణ చేయాలని షియావో పింగ్ నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన కొత్త అప్డేట్ ఈ సమావేశాల్లో రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జిన్ పింగ్ ఒక శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా కీలక పదవులను తనవద్దే ఉంచుకున్నారు. ఇక మరోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఆయన ఆశలు త్వరలో నెరవేరనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.