Begin typing your search above and press return to search.
సీజేఐ కాకముందు.. జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన చారిత్రక తీర్పులు
By: Tupaki Desk | 24 April 2021 2:30 PM GMTతెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే.. ఇంత అత్యున్నత శిఖరంపై అధిష్టించడానికి జస్టిస్ ఎన్వీ రమణ ఎంతో కష్టించారు. ఇక, న్యాయమూర్తిగా ఆయన అనేక సంచలన తీర్పులు ఇచ్చారు. వృత్తి పట్ల నిబద్ధత, ప్రజల అభ్యున్నతి, రాజ్యాంగంపట్ల సాధికారత ఆయనను ఈ అత్యున్నత శిఖరం అధిరోహించేలా చేసిందని అంటున్నారు నిపుణులు.
జస్టిస్ ఎన్వీరమణ ఇచ్చిన సంచలన తీర్పులు కొన్ని..
+ అనేక కీలకమైన అంశాలను విచారించిన ధర్మాసనాల్లో జస్టిస్ ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు వ్యాజ్యాలు, సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వంటి వ్యాజ్యాలపై విచారణ చేపట్టి కీలక తీర్పులు వెలువరించారు.
+ ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు.. జస్టిస్ రమణ ఆదేశాలు ఉపకరించాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్ర తినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ.. 2020 సెప్టెంబర్ 17న జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించింది.
+ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణం రద్దు.. రాజ్యాంగపరంగా చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సైతం.. జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోనే ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని.. జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
+ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం.. సమాచార హక్కు పరిధిలోనే ఉంటుందంటూ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి. రమణ సభ్యులు. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్-2019 కేసులో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
+ మహిళా సాధికారత, సమానత్వ సాధన దిశగా జస్టిస్ ఎన్. వి. రమణ ఇచ్చిన తీర్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇంట్లో గృహిణులు చేసే పని కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తీసిపోదంటూ.. ఈ ఏడాది మొదట్లో జస్టిస్ ఎన్. వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఇచ్చిన తీర్పుతో మహిళాలోకంలో.. హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
+ 2016 నాటి ఆదిశైవ శివాచారియార్గల్ నల సంఘం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో దేవాలయాల్లో అర్చకులను నియమించడం లేదా తొలగించడం.. ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు రాదని జస్టిస్ ఎన్.వి. రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అర్చకుల నియామకం.. ఆగమశాస్త్రానికి అనుగుణంగా, రాజ్యాంగ పరమైన ఆదేశాలు, సూత్రాలకు అనుగుణంగా ఉండాలని తీర్పునిచ్చింది.