Begin typing your search above and press return to search.

హలోవీన్... దీని గురించి మీకేం తెలుసు?

By:  Tupaki Desk   |   3 Nov 2015 1:30 PM GMT
హలోవీన్... దీని గురించి మీకేం తెలుసు?
X
అమెరికాలో హాలోవీన్ డేకు అత్యంత ఆదరణ ఉంటుంది.. అక్కడ క్రిస్మస్ తరువాత ఆ స్థాయిలో నిర్వహించే వేడుకలు ఇవే. కుటుంబ వేడుకలుగా జరుపుకొనే హాలోవీన్ డే అంటే పిల్లాపెద్దా అంతా ఎంతో ఇష్టపడతారు. అమెరికాలో హాలోవీన్ డే సందర్భంగా ఏకంగా 700 కోట్ల డార్ల మేర వ్యాపారం జరుగుతుంది. ప్రతి అమెరికన్ హాలోవెన్ డే సందర్భంగా కొత్త బట్టలు ధరించడంతోపాటు, ఇంటిని అలంకరించుకుంటారు. అమెరికా, భారత్ ల మధ్య ప్రజా సంబంధాలు పెరుగుతున్న కొద్దీ అక్కడి సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడికి వ్యాపిస్తున్నాయి. ఆ క్రమంలో హాలోవెన్ డే ఉత్సవాలూ ఇండియాకు వచ్చేశాయి. ఏటేటా వీటి నిర్వహణ పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ లో నూ హాలోవన్ సంబరాలు జరుపుకొంటున్నారు. తాజాగా హాలోవీన్ డేను పురస్కరించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో థ్రిల్లర్ నైట్ హాలోవీన్ కాస్ట్యూమ్స్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిన్నారులు - పెద్దలు వివిధ లతో సందడి చేశారు. ముఖానికి పెయింటింగ్స్ వేసుకుకొని ఆకట్టుకున్నారు. ఇష్టమైన దుస్తులను ధరించి, ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. చిన్నారులు వారి కుటుంబసభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అసలు ఏమిటీ వేడుకలు

వేల ఏళ్ల కిందట మొదలైన వేడుకలు ఇవి. కేవలం క్రిస్టియన్లకు సంబంధించిందే అని కాకుండా అనేక మతాల్లో ఈ వేడుకలు జరుపుకొనే సంప్రదాయం ఉంది. కాబట్టి హాలోవెన్ డేను సర్వమత పండుగగా చెప్పొచ్చు. 2 వేల ఏళ్ల కిందట బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండులో నివసించే సెల్ట్స్ జరుపుకొన్న ఈ వేడుకలు క్రమంగా అందరి ఆదరణా పొందాయి. పంటలు చేతికందాక జరుపుకొనేవారు. అక్టోబరు 31ని సంవత్సరాంతంగా భావిస్తూ కూడా హాలోవెన్ డే చేసేవారని చెబుతారు. పొలాల్లో పంటలు ఉన్నంతకాలం, భూతాలు - దెయ్యాలు నేలలో ఉంటాయని... పంటలు కోసేసిన తరువాత ఖాళీగా ఉన్న పొలాల్లో దెయ్యాలు తిరుగుతాయని భావిస్తూ వాటి బారి నుంచి రక్షించుకోవాడానికి, వాటిని కన్ఫ్యూజ్ చేయడానికి, వాటిని భయపెట్టడానికి అన్నట్లుగా దెయ్యాలు - రాక్షసులు - భూతాలు వేషధారణలతో తిరిగేవారట. ఆ రకంగా హాలోవెన్ డే నాడు మాస్కులు వేసుకునే ఆచారం వచ్చింది.

కాలక్రమేణా ఈ వేడుకలపై ఇతర సంస్కృతుల ప్రభావం పడింది. క్రీస్తు శకం 49లో రోమన్లు సెల్జు జాతీయులను జయించిన తరువాత రోమన్ వేడుకల్లో కలిసిపోయి.. ఆ తరువాత వివిధ రకాలుగా మారి. ఇప్పుడున్న పద్ధతిలో హాలోవీన్ డే పరిణామం చెందింది.