Begin typing your search above and press return to search.
పరకాల మారణహోమం.. తలుచుకుంటే నెత్తురు ఉడకడం ఖాయం
By: Tupaki Desk | 17 Sep 2020 10:10 AM GMTతెలంగాణ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ.. రజాకార్ల దాష్టీకాలను వీరోచితంగా ఎదురించిన నేల. ఇక్కడి మట్టిలోని ప్రతిరేణువు వీరుల రక్తంతో తడిసిపోయింది. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల తెలంగాణ వీరులకు, వీరోచిత పోరాటాలకు, రజాకార్ల క్రూరత్వానికి సాక్ష్యంగా నిలిచింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రానికి (నిజాం రాజ్యం) విముక్తి లభించలేదన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలోని చాలా చోట్ల జాతీయ జెండాలను ఎగరవేసేందుకు జాతీయవాదులు యత్నించారు. ఆ ప్రయత్నాలను రజాకార్లు ఉక్కుపాదంతో అణచివేసేవారు. దుర్మార్గులైన రజాకార్లు అమాయకులైన తెలంగాణ బిడ్దలపై సామూహిక అత్యాచారాలు చేశారు. అడ్డొచ్చిన యువకులను నిలువునా నరికేశారు. ఆ సమయంలో వారి మారణకాండకు అంతే లేకుండా పోయింది. అలా రజాకార్ల అరాచకాలకు బలైన ప్రాంతాల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాల రజాకార్ల దాష్టికాలకు సాక్షిభూతంగా నిలిచింది. అంతేకాక తెలంగాణ బిడ్డల వీరోచిత పోరాటాలకు ప్రతీకగా కొనసాగుతున్నది. అసలు ఈ అమరధామం ఎందుకు మరో జలియన్‌వాలా బాగ్ అయ్యింది. అక్కడి ప్రజలు ఎందుకంత తిరుగుబాటు చేశారో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..
నేపథ్యం..
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశవ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క హైదరాబాద్ రాష్ట్రం మాత్రం మూగబోయింది. తన పక్కన ఉన్న తెలుగుబిడ్డలు సంబురాలు జరుపుకుంటున్నా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లభించలేదు. తమ రాజ్యాన్ని పాలిస్తున్న మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన దేశాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించలేదు. దేశంలో ఎవరన్నా సంబురాలు జరుపుకున్నా, ఉద్యమాలు చేసినా ఉక్కుపాదంతో అణచి వేయాలని తన బావమరిది ఖాసిం రజ్వీతో ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సైన్యం రజకార్లుగా పిలువబడేది. వీరంతా గ్రామాల్లోకి చొరబడి మహిళలపై లైంగకదాడి చేసేవారు. మహిళలతో మూకుమ్మడిగా నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. వీరి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది.
పరకాలలో ఏం జరిగింది..
భారతదేశానికి స్వాత్రంత్యం వచ్చాక హైదరాబాద్ రాష్ట్రంలో ఒకరకమైన ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతల పోరాటాలు. దొరల అరాచకాలు, సంఘం కార్యకలాపాలు చాలా ఉధృతంగా సాగుతున్న రోజులవి. రజాకార్లు.. విప్లవకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఉండేంది. ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వస్తే.. సెప్టెంబర్ 2న పరకాలలో జాతీయ పతాకం ఎగురవేయాలని గ్రామస్థులు నిర్ణయించారు. కానీ ఎలాగో ఈ విషయం రజాకార్లకు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న రజాకార్లు మారణకాండకు తెరలేపారు. దాదాపు 22 మందిని కాల్చిచంపారు.
ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేను.. ఈ ఘటనను కళ్లారా చూసిన పావుశెట్టి వైకుంఠం ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే.. నా వయస్సు అప్పుడు తొమ్మిదేళ్లు. స్వాతంత్రం రావడంతో 1947 సెప్టెంబర్ 2న మా గ్రామంలో జాతీయ పతాకం ఎగురవేయాలని పెద్దమనుషులు నిర్ణయించారు. చుట్టు పక్క గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు మా గ్రామానికి చేరుకున్నారు. పరకాలలో చాపల బండ ప్రాంతానికి జనాలు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రజాకార్లు మారణాయుధాలతో అక్కడికి చేరుకొని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 22 మంది అమరులయ్యారు.
వీరులకు స్మృతికి చిహ్నంగా అమరధామం భాజపా నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు వీరుల మృతికి చిహ్నంగా పరకాలలో అమరధామం పేరిట ఓ నిర్మాణాన్ని చేపట్టారు. అమరధామాన్ని 1998లో బీజేపీ సీనియర్ నేత అద్వాని ఆవిష్కరించారు. కాగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పరకాల ఘటనను దక్షిణాది జలియన్‌వాలాబాగ్ గా గుర్తించారు.