Begin typing your search above and press return to search.
రామానుజులు ఎవరు? ఆయన ఎందుకు పూజనీయులయ్యారు?
By: Tupaki Desk | 5 Feb 2022 11:30 AM GMTసమతామూర్తి.. రామానుజుల గురించి ఎంత తెలుసుకున్నా..తక్కువే. సమాజంలో జాతివివక్షపై పోరాటా నికి నాంది పలికింది ఆయనే అనడంలో అతిశయోక్తి లేదు. ''అందరి దుఃఖాలూ దూరం చేయడానికి నేనొక్కడినే నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ'స.. అని ప్రబోధించిన వారు రామానుజులు.
రామానుజాచార్య భక్తి ఉద్యమకారులు. సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధిస్థితిని పొందా రు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు. శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం. ఆయన సమాధి(బృందావనం లేదా తిరుమేని) ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో ఉంది. విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు.
నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శంఖ, చక్రాల ముద్రలు వేసుకోవడం ఈ శాఖ లక్షణం. ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు. శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేధించారు.
శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే..‘‘ గోష్ఠీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని(ఓం నమో నారాయణాయ) ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ, గుడి గోపురం ఎక్కి గట్టిగా అందిరికీ వినిపించేలా చెప్పారు రామానుజులు. ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి, పర్యవేక్షణకు అక్కడ జీయంగార్ల వ్యవస్థను రామానుజులే ఏర్పాటు చేశారని అంటారు. కులోత్తుంగ చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసించినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాలలో దళితుల ఆలయ ప్రవేశానికి కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా మార్చారు. కొందరికి ఆలయంలో అర్చకత్వ అవకాశం కూడా కల్పించారు.
సమానత్వం, ఆప్యాయత, భక్తి మార్గమే భగవంతుడిని పొందటానికి ఉత్తమ మార్గమని ఆయన బాగా విశ్వసించారు. ప్రకృతి, గాలి, నీరు, నేల వంటి వనరులను కూడా కాపాడుకోవాలని ప్రచారం చేశారు. ఆ రోజుల్లోనే అత్యంత అణగారిన వారికి విద్యను అందుబాటులోకి తెచ్చి ‘వసుదైక కుటుంబం’ అనే భావనను ప్రజల్లో పెంపొందించారు. అన్నమాచార్య, భక్త రామదాస్, త్యాగరాజు, కబీర్, మీరాబాయి వంటి ప్రాచీన కవులకు సైతం రామానుజుని బోధనలు స్ఫూర్తినిచ్చాయి. సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన సమాజంలో వివక్షకు గురైన వారికి దేవాలయాల తలుపులు తెరిచాడు.
కాగా, ఆది దేవుడే రామానుజాచార్యులుగా అవతరించినట్లు భక్తులు నమ్ముతారు. పురాతన గ్రంథాల ప్రకారం రామానుజాచార్యులు సుమారు 120 ఏళ్లకు పైగా జీవించాడని తెలుస్తోంది. 2016 ఆయన జన్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి. జీవించి ఉన్నంత సేపు సమానత్వం కోసం పాటుపడ్డ రామానుజునికి నివాళిలో భాగంగానే చిన్న జీయర్ స్వామి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించడానికి నడుంబిగించారు.