Begin typing your search above and press return to search.

దేశ చరిత్రలోనే జరగనిది ఏపీలో జరుగుతుందట

By:  Tupaki Desk   |   25 Jan 2022 9:30 AM GMT
దేశ చరిత్రలోనే జరగనిది ఏపీలో జరుగుతుందట
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా ప్రకటించిన కొత్త పీఆర్సీ రగడ అంతకంతకూ ముదురుతోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిమొదటి వారం నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే ఏపీ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేయటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు ఎప్పుడూ.. ఎక్కడా వినని.. చూడని పరిణామాలు ఏపీలో చోటు చేసుకుంటున్నట్లుగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నిన్నటికి నిన్న సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం.. తానెప్పుడూ కొత్త జీతాలు వద్దని.. పాత జీతాలు ఇవ్వమని ఉద్యోగులు అడగటం ఎక్కడా చూడలేదన్నారు.

ప్రభుత్వానికి రూ.10వేల కోట్లకు పైగా ఆర్థిక భారం పడే అవకాశం ఉన్న కొత్త జీతాలు వద్దని.. తమకు ఇప్పటివరకు ఇస్తున్న పాత జీతాల్ని ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరనసలకు.. ఆందోళనలకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కారర్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ కొత్త జీతాలు వద్దని.. పాత జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు అడిగింది లేదన్నారు. జగన్ పాలన మొత్తం రివర్సులా ఉందన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా.. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. రాష్ట్రంలో జగన్ కు ఇదే తొలిసారి.. ఇదే ఆఖరుసారన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రానని తెలిసే.. ఏపీని ఆర్థికంగా నాశనం చేయాలని చూస్తున్నట్లుగా విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

ఏపీని ఆర్థికంగా అన్ని రకాలుగానే నాశనం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఏపీ ఆర్థికంగా అన్ని రంగాల్లో దెబ్బ తిన్నదని మండిపడ్డ విష్ణు.. రాష్ట్రాన్ని జూదగాళ్ల రాష్ట్రంగా తయారు చేశారన్నారు. ఉద్యోగులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జగన్ పాలన మొత్తం రివర్సులో నడుస్తోందని.. దానికి త్వరలోనే చరమగీతం పాడాలన్నారు.