Begin typing your search above and press return to search.

హైటెక్ కార్ల దొంగ.. 10 రాష్ట్రాల్లో 61 చోరీలు.. పోలీసులకే సవాల్

By:  Tupaki Desk   |   24 April 2022 1:30 AM GMT
హైటెక్ కార్ల దొంగ.. 10 రాష్ట్రాల్లో 61 చోరీలు.. పోలీసులకే సవాల్
X
హైఎండ్ కార్లను టార్గెట్ చేసుకొని 2003 నుంచి చోరీలకు పాల్పడుతున్న బాగా చదువుకున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. కార్ల చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన మాజీ ఆర్మీ జవాన్ కుమారుడైన సత్యేంద్రసింగ్ షెకావత్ ను ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి కార్ల చోరీ మొదలుపెట్టిన సదురు దొంగ ఇప్పటివరకూ 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేసినట్లు సమాచారం. ఇతడిపై సైబరాబాద్, హైదరాబాద్,రాచకొండలలో ఐదు కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలో 2003లో క్వాలీస్ చోరీ చేయడంతో మొదలైన సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే చోరీ చేసే దాకా మారింది. చోరీ చేసిన కార్లను విక్రయించి జల్సాలు చేస్తాడు. కేవలం అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసుకొని సత్యేంద్ర సింగ్ షెకావత్ వాటిని చోరీ చేయడంతో తన ప్రత్యేకతను కనబరుస్తాడు.

కారు తాళాలు స్కాన్ చేయడానికి.. వాహనం నెంబర్ ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికిని కనిపెడుతాడు. ఇక డూప్లికేట్ కు తయారు చేసుకోవడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు.

కారు తాళం తయారు చేయడంలో ఇతడికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. లేటెస్ట్ గా వస్తున్న సెన్సార్ వాహనాలను కూడా సత్యేంద్ర సింగ్ షెకావత్ చాకచక్యంగా చోరీ చేస్తున్నాడు. వీటిని చోరీ చేయడం కోసం చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్ టూల్ ఎక్స్ 100 ప్యాడ్ అనే పరికరాన్ని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నాడు.

2003 నుంచి ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంతోపాటు కేరళ,కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, డయ్యూ డామన్ లలో 58 వాహనాలను చోరీ చేశాడు. సత్యేంద్ర సింగ్ చోరీల్లో ఆయన భార్య పాత్ర కూడా ఉండడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసులకే ఫోన్ చేసి తనను పట్టుకోవాలంటూ సవాల్ చేశాడు సత్యేంద్ర. దీంతో పోలీసులు చాలెంజింగ్ గా తీసుకొని ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు సత్యేద్ర సింగ్ షెకావత్ ను అరెస్ట్ చేశారు. శుక్రవారం పీటీ వారెంట్ పై బంజారాహిల్స్ పోలీసులు అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని సత్యేంద్ర సింగ్ పై దర్యాప్తు చేస్తున్నారు. అతడు చోరీ చేసిన కార్లను రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.