Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ.. ట్రయల్స్ నిలిపివేసిన సంస్థ..!
By: Tupaki Desk | 12 Dec 2020 12:30 PM GMTకరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇప్పటికే పలుదేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. చాలా దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ సాగుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, సీఎల్ఎల్ ఔషధ సంస్థ సంయుక్తంగా ఓ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. అయితే వ్యాక్సిన్ ఇచ్చిన కొంతమందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందట. దీంతో వెంటనే ట్రయల్స్ ఆపేశారు.
ఆస్ట్రేలియా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ మొదట సత్ఫలితాలు ఇచ్చింది. తొలి, రెండో దశ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. కానీ చివరిదశ ట్రయల్స్‌లో మాత్రం దుష్ప్రభావాలు కనిపించాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
‘మేం తయారుచేసిన వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న యాంటీబాడీలు కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్నాయి. అయితే కొంతమంది రోగుల్లో హెచ్ఐవీ పాజిటివ్ రావడాన్ని గుర్తించాం. నిజానికి సదరు వ్యక్తులకు మా వ్యాక్సిన్ వల్ల హెచ్ఐవీ రావడం లేదు. కానీ హెచ్ఐవీ పరీక్షలు చేసినప్పుడు పాజిటివ్‌గా చూపిస్తుంది.
ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలో జోక్యం చేసుకుంటున్నాయి. అందుకే అలా చూపిస్తుంది. వాళ్లకు ఏ ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ మేం ట్రయల్స్ నిలిపివేశాం. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు సాగుతున్నాయి’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియా ఇతర దేశాలకు చెందిన కంపెనీలతోనూ వ్యాక్సిన్ పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. దేశీయ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ప్రజలకు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ తీసుకొచ్చి పంపిణీ చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతున్నది.