Begin typing your search above and press return to search.

దుమారం రేపిన దుస్తుల యాడ్..వైర‌ల్ ఫొటో!

By:  Tupaki Desk   |   9 Jan 2018 11:30 PM GMT
దుమారం రేపిన దుస్తుల యాడ్..వైర‌ల్ ఫొటో!
X
ప్ర‌స్తుతం మార్కెట్ లో ల‌భించే గుండు సూది నుంచి గ్యాడ్జెట్స్ వ‌ర‌కూ ప్ర‌తి ఉత్ప‌త్తికి సంబంధించిన కంపెనీలు...ఇటు మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేస్తున్నాయి. త‌మ ప్రొడ‌క్ట్ గొప్ప‌దంటే...త‌మది నెంబ‌ర్ వ‌న్ అని....త‌మ ఉత్ప‌త్తుల‌ను తెగ ప్ర‌మోట్ చేసుకుంటున్నాయి. ఓ ర‌కంగా చెప్పాలంటే కొన్ని ర‌కాల ఉత్ప‌త్తుల‌ను కొంత‌మంది కేవ‌లం ప్ర‌క‌ట‌నలు చూసి కొంటున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అందుకే, కొంత‌మంది హీరోలు - సెల‌బ్రిటీలు...తాము కొన్ని ఉత్ప‌త్తుల త‌ర‌పున ప్ర‌చారం చేయబోమ‌ని, ఆయా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో కొంత‌కాలం క్రితం విడుద‌లైన డోవ్ క్రీమ్ ప్ర‌క‌ట‌న పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. త‌మ ఉత్ప‌త్తుల‌ను వాడిన త‌ర్వాత ఇలా న‌ల్ల‌గా ఉన్న అమ్మాయి నుంచి తెల్ల‌గా ఉన్న అమ్మాయిలా మారిపోతారంటూ డోవ్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఆ ప్ర‌క‌ట‌న‌లో న‌లుపును సూచించేందుకు న‌ల్ల‌జాతి మోడ‌ల్ ను...తెల్ల‌గా ఉండేందుకు శ్వేత‌జాతి మోడ‌ల్ ను ఆ కంపెనీ ఎంచుకుంది. ఆ యాడ్ పై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త రేగింది. ఆ త‌ర్వాత డోవ్ కంపెనీ దిగివ‌చ్చి.... క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

తాజాగా, అదే త‌ర‌హాలో బ్రిట‌న్ లో త‌మ అమ్మ‌కాల‌ను పెంచుకునేందుకు స్వీడిష్‌ దుస్తుల కంపెనీ....ఆన్‌ లైన్‌ అమ్మకాల సంస్థ హెచ్‌ అండ్‌ ఎమ్‌ తో ఒప్పందం కుద‌ర్చుకుంది. దానికి సంబంధించి ఆ ఆన్ లైన్ కంపెనీ రూపొందించిన‌ ఓ ప్ర‌క‌ట‌న పెను వివాదానికి దారి తీసింది. త‌మ దుస్తుల ప్ర‌మోష‌న్ కోసం రూపొందించిన యాడ్ లో ఓ న‌ల్ల‌జాతి పిల్ల‌వాడు‘కూలెస్ట్‌ మంకీ ఇన్‌ ది జంగిల్‌’ అంటూ ముద్రించిన ఓ స్వెట‌ర్ ను ధ‌రించాడు. ఆ పక్కనే శ్వేత జాతికి చెందిన ఓ పిల్ల‌వాడు పులి ఫోటో ఉన్న స్వెటర్ ధ‌రించాడు. శ్వేత జాతీయులు గొప్పవారు అని అర్థం వచ్చేలా ఆ ష‌ర్టు పై రాసి ఉంది. దీంతో, ఆ ప్ర‌క‌ట‌న‌.....నల్ల జాతీయులను కించపరిచేలా ఉందంటూ.....నల్లజాతీయుల ఫోరమ్‌ నిరసన చేపట్టింది.

హెచ్‌ అండ్‌ ఎమ్‌ పై హాలీవుడ్‌ సెలబ్రిటీలు - పాత్రికేయులు - ఉద్యమకారులు నిప్పులు చెరిగారు. హెచ్‌ అండ్‌ ఎమ్‌ కి మతి పోయిందటూ న్యూ యార్క్‌ టైమ్స్‌ కాలమిస్ట్‌ ట్వీట్‌ చేశారు. హెచ్‌ అండ్‌ ఎమ్‌ కు మద్దతుగా కొంద‌రు పోస్టులు చేయటంతో సోషల్‌ మీడియాలో వెర్బ‌ల్ వార్ న‌డిచింది. నల్ల జాతీయుల ఫోరమ్‌ వ్యతిరేక ఉద్యమం వ‌ల్ల హెచ్‌ అండ్‌ ఎమ్‌ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో, చివ‌ర‌కు ఆ సంస్థ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ ఫోటో కారణంగా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని - అందుకు తాము పశ్చాత్తాపప‌డుతున్నామ‌ని తెలుపుతూ క్షమించమని కోరింది. త‌మ‌ ఛానెల్స్‌ నుంచి ఆ ఫోటోను తొల‌గిస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది.