Begin typing your search above and press return to search.

ద‌మ్ముంటే.. ఈ అధినేత‌పై చ‌ర్య తీసుకోవాలి

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:33 AM GMT
ద‌మ్ముంటే.. ఈ అధినేత‌పై చ‌ర్య తీసుకోవాలి
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే జ‌మ్ముకశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి.. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫ‌రూక్ అబ్దుల్లా దారుణ‌మైన రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన వ్యాఖ్య‌లు ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు భార‌తీయుడ‌న్న ప్ర‌తి ఒక్క‌రికి ఒళ్లు మండేలా చేయ‌టం ఖాయం.

కేంద్రానికి ద‌మ్ముంటే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లో కాదు.. శ్రీ‌న‌గ‌ర్ న‌డిబొడ్డున ఉన్న లాల్ చౌక్ లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయాలంటూ వ్యాఖ్యానించారు. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ భార‌త్ లో ఎప్ప‌టికి అంత‌ర్భాగం కాదంటూ గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికి సెగ‌లు రేపుతున్నాయి. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వింటే.. క‌శ్మీర్ లో భార‌త ప‌రిస్థితి ఏమిట‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

సోష‌ల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతూ శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం వాటిల్లేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. లేనిపోని ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్న‌ట్లుగా చెప్పి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే అధికారులు.. ఫ‌రూక్ విష‌యంలో ఎందుకు చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. అంటే.. దేశ సార్వ‌భౌమాధికారాన్ని ప్ర‌శ్నించేలా.. స‌వాలు విసిరేలా మాట్లాడినా మౌనంగా ఉండ‌టం అర్థం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఒక సామాన్యుడు భావోద్వేగంతో ఏదైనా తప్పు మాట్లాడిన వెంట‌నే స్పందించే చ‌ట్టం.. ఒక మాజీ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టాన్ని చూసీచూడ‌న‌ట్లుగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న‌నేం చేసినా క‌శ్మీర్ క‌ల్లోలం అవుతుంద‌న్న ధీమానే ఫ‌రూక్ చేత ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌శ్మీర్ లోయ‌లో అశాంతికి తెర తీసేలా ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన నేత కావ‌టంతో ఆయ‌న ఎన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా చ‌ట్టం భ‌రిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అంటూ త‌ర‌చూ చెప్పే మాట‌ల‌కు పొంత‌న లేన‌ట్లుగా తాజా ప‌రిస్థితి ఉంద‌ని చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో కేంద్రానికి మంట పుట్టేలా వ్యాఖ్య‌లు చేస్తున్న ఫ‌రూక్‌.. తాజాగా మాత్రం దేశాన్ని అభిమానించే వారంద‌రికి మంట పుట్టేలా మాట్లాడార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

క‌శ్మీర్‌ లో నేటి ప‌రిస్థితుల‌కు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌వ‌ర్ లో ఉన్న పాల‌కులు చేసిన దుర్మార్గ‌మేన‌ని చెప్పాలి. ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లిత‌మే తాజా వ్యాఖ్య‌లుగా చెప్పాలి. పాక్ ఆక్ర‌మిత భార‌త్ ఎప్ప‌టికీ భార‌త్ లో అంత‌ర్భాగం కాద‌ని.. జ‌మ్ముక‌శ్మీర్ వారిది కాదంటూ పున‌రుద్ఘాటించిన ఫ‌రూక్‌..శ్రీ‌న‌గ‌ర్ లోని లాల్ చౌక్ లో తొలు జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌న్నారు. ఫ‌రూక్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందించింది. జ‌మ్ముక‌శ్మీర్ డిప్యూటీ ముఖ్య‌మంత్రి నిర్మ‌ల్ సింగ్ మాట్లాడుతూ.. ఫ‌రూక్ మాట‌లు వేర్పాటువాదుల్ని.. ఉగ్ర‌వాదుల్ని ప్రోత్స‌హించేలా ఉన్నాయ‌న్నారు. లాల్ చౌక్ తో స‌హా జ‌మ్ముక‌శ్మీర్ లోని న‌లువైపులా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేస్తున్న సంగ‌తిని ఫ‌రూక్ మ‌ర్చిపోయారంటూ చుర‌క‌లేశారు. మిగిలిన చ‌ర్య‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. త‌ప్పుడు స‌మాచారం అందిస్తున్న నేరాన్ని అయినా ఆయ‌న‌పై మోపాల్సిన అవ‌స‌రం ఉంది.