Begin typing your search above and press return to search.
ట్రంప్ ను చెత్త అన్న హాలీవుడ్ హీరో
By: Tupaki Desk | 14 Aug 2016 12:11 PM GMTమాటలతో మంటలు పుట్టించటమే కాదు.. ప్రపంచ దేశాల్లో గగ్గోలు పెట్టించిన సత్తా అమెరికా అధ్యక్ష బరిలోఉన్న డోనాల్డ్ ట్రంప్ కే దక్కింది. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా దేశానికి అధ్యక్ష స్థానంలో ఎలాంటి వ్యక్తి అయితే ఉండకూడదో సరిగ్గా.. అలాంటి లక్షణాలతో బరిలోకి దిగిన ఈ రిపబ్లికన్ నేతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు సొంత పార్టీ నేతలు సైతం ఆయనపై మండి పడే దుస్థితి.
ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో సైతం ట్రంప్ ను తెగ తిట్టేస్తున్నారు. తన కొత్తసినిమా ప్రమోషన్ కోసం అరబ్ దేశాలకు వెళ్లిన హీరో.. సినిమా గురించి ప్రచారం సంగతేమో కానీ.. ట్రంప్ తీరును కడిగేస్తూ వ్యాఖ్యలు చేయటం పెను దుమారం రేపుతోంది. ముస్లింలంటే అమెరికన్లలో భయాన్ని కలిగించేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఒక్కోసారి అతని మాటలు వింటుంటే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు.
ఇంతవరకూ అన్నా సరిపోతుంది. కానీ.. అంతకు మించి అన్నట్లుగా ట్రంప్ ను ఏకంగా చెత్తతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలు చాలా క్రూరంగా ఉన్నాయని.. ఏది మంచో.. ఏది చెడో అమెరికన్లు గ్రహిస్తున్నారని.. చెత్తగా వాగే వాళ్లను దేశం నుంచి ఊడ్చేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ నేతకు మించి ఒక స్టార్ హీరో అధ్యక్ష అభ్యర్థిని ఇంతేసి మాటలు అనటం.. తీవ్రస్థాయి ధ్వజమెత్తటం చూస్తే.. ట్రంప్ ను వ్యతిరేకించే వారంతా బలమైన గొంతును విప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ దూకుడు మరింత పెరిగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.